ఉద్యోగుల పింఛను పథకం కింద పెన్షన్ మార్పిడి (కమ్యుటేషన్)ను పునరుద్ధరించాలన్న ఈపీఎఫ్ఓ నిర్ణయాన్ని కార్మిక మంత్రిత్వశాఖ అమలు చేసింది. ఫలితంగా 6.3 లక్షల మంది పింఛనుదారులకు ప్రయోజనం చేకూరనుంది.
ఎంతో ప్రయోజనకరం
పెన్షన్ కమ్యుటేషన్ అంటే చందాదారుడు ముందుగానే కొంత పింఛను మొత్తాన్ని విత్డ్రా చేసుకోవడం. పెన్షన్ కమ్యుటేషన్ కింద వచ్చే 15 సంవత్సరాల వరకు నెలవారీ పెన్షన్ మూడింట ఒక వంతు తగ్గుతుంది. ఈ తగ్గించిన మొత్తాన్ని ఒకేసారిగా ఇస్తారు. 15 ఏళ్ల తరువాత పెన్షనర్లు పూర్తి పింఛను పొందడానికి అర్హులు అవుతారు.
2019 ఆగస్టులో ఈపీఎఫ్ఓ కేంద్ర ట్రస్టీల బోర్డు పెన్షన్ కమ్యుటేషన్ను పునరుద్ధరించే ప్రతిపాదనను ఆమోదించింది. ఈ నిర్ణయాన్ని 2020 ఫిబ్రవరి 20న కార్మిక మంత్రిత్వశాఖ నోటిఫై చేసింది. ఫలితంగా 2008 సెప్టెంబర్ 25న లేదా అంతకుముందు పెన్షన్ కమ్యుటేషన్కు ఎంచుకున్నవారి పెన్షన్ పునరుద్ధరణ జరిగింది.
ఇంతకు ముందు ఈపీఎస్-95 కింద, సభ్యులు తమ పెన్షన్లో మూడింట ఒక వంతును 10 సంవత్సరాల పాటు మార్చడానికి అనుమతించారు. ఇది 15 ఏళ్ల తరువాత పునరుద్ధరించారు. ఈ సదుపాయం ఇప్పటికీ కొన్ని వర్గాల ప్రభుత్వ ఉద్యోగులుకు అందుబాటులో ఉంది.
ఇదీ చూడండి: భారీగా తగ్గిన బంగారం ధర- నేటి లెక్కలివే...