స్టాక్మార్కెట్లో నైకా ఐపీఓ(nykaa ipo) అంచనాలను మించి విజయవంతమైంది. ఈ ఈ-కామర్స్ సంస్థలో పెట్టుబడులు పెట్టిన, షేర్లు కలిగిన వారికి లాభాల పంట పండించింది. దీంతో సంస్థ యజమాని, సీఈఓ ఫాల్గుణ నాయర్ భారత్‌లో తొలి స్వతంత్ర మహిళా బిలియనీర్‌గా అవతరించారు. ఆమెతో పాటు ఈ సంస్థలో వాటాలు కలిగిన చాలా మంది భారీ లాభాలను ఆర్జించారు. వీరిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బాలీవుడ్ టాప్ హీరోయిన్లు కత్రినా కైఫ్, ఆలియా భట్ గురించి. ఐపీఓకు(nykaa ipo 2021) ముందే నైకాలో పెట్టుబడులు పెట్టిన వీరిద్దరూ ఇప్పుడు 10 రెట్లకు పైగా లాభాలు గడించారు.
కత్రినా, ఆలియా ఎన్ని కోట్లు సంపాదించారంటే...
తన కాయ్ బ్యూటీ ఉత్పత్తులను నైకాలో(nykaa ipo news) లాంచ్ చేసిన ఏడాది తర్వాత ఆ సంస్థలో పెట్టుబడులు పెట్టింది కత్రినా. ఈ బ్రాండ్ విజయవంతంగా వృద్ధి చెందాక మరింత ఆసక్తితో వాటాలు కొనుగోలు చేసింది. 2018లో రూ.2.02కోట్లతో చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టింది(katrina kaif nykaa investment). ప్రస్తుత వాటాతో పోల్చితే ఇది చాలా తక్కువ. మరో బాలీవుడ్ యువనటి ఆలియా భట్ నైకాపై(alia bhatt nykaa) కాస్త ఎక్కువ నమ్మకమే ఉంచింది. ఇందులో రూ.4.95కోట్లు పెట్టుబడి పెట్టింది. ఇప్పుడు నైకా ఐపీఓ అత్యంత విజయవంతం కావడం వల్ల వీరిద్దరి వాటాల విలువ ఒక్క రోజులోనే 10 రెట్లుకు పైగా వృద్ధి చెందింది.
బుధవారం మార్కెట్ క్లోజింగ్ సమయానికి కత్రినా పెట్టుబడి(katrina kaif nykaa) విలువ రూ.2.02కోట్ల నుంచి రూ.22కోట్లకు చేరగా.. ఆలియా పెట్టుబడి విలువ ఏకంగా రూ.4.95కోట్ల నుంచి రూ.54కోట్లకు పెరిగింది(alia bhatt invests in nykaa). దీంతో ఇద్దరు ముద్దుగుమ్మలు నటనలోనే కాదు స్టాక్మార్కెట్లోనూ తమ జోరు చూపించినట్లైంది.
నైకా ఐపీఓ(nykaa ipo 2021) సక్సెస్ ద్వారా అత్యంత ఎక్కువగా లాభం గడించింది మాత్రం సంస్థ సీఈఓ ఫాల్గుణ నాయరే. ఈ ఐపీఓతో నైకా మాతృ సంస్థ ఎఫ్ఎస్ఎన్ ఈ-కామర్స్ మార్కెట్ క్యాప్ ఒక్కసారిగా రెట్టింపు అయి 13 బిలియన్ డాలర్లకు చేరింది. 6.5 బిలియన్ డాలర్ల నెట్ వ్యాల్యూతో ఫాల్గుణ.. భారత బిలియనీర్ల జాబితాతో చేరారు.
కంపెనీ ఐపీఓ ద్వారా సెలబ్రిటీలు భారీగా లాభాలు ఆర్జించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా జస్ట్ డయల్ ద్వారా జాక్‌పాట్ కొట్టారు. 2013లో సంస్థ ఐపీఓకు వెళ్లిన తర్వాత బచ్చన్ పెట్టిన పెట్టుబడి ఏకంగా 46 రెట్లు పెరిగింది. ఇప్పటివరకు ఐపీఓ ద్వారా అత్యంత ఎక్కువ లాభాలు ఆర్జించింది బిగ్ బీనే కావడం గమనార్హం.
ఇదీ చదవండి: ఆ రోజే స్టాక్ మార్కెట్లో పేటీఎం షేర్స్ లిస్టింగ్.. ఆరంభ ధర ఎంతంటే?