ETV Bharat / business

'వర్క్​ ఫ్రమ్​ హోమ్​' ఉద్యోగాల కోసం భారతీయుల వేట

కరోనా సంక్షోభం వల్ల అనేక మంది ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్రమంలో 'వర్క్​ ఫ్రమ్​ హోమ్​' చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారట చాలా మంది ఉద్యోగులు. భారత్​లో ఇలాంటి ఉద్యోగాల కోసం అన్వేషిస్తున్న వారి సంఖ్య నాలుగు నెలల కాలంలో 377 శాతం పెరిగిందని ఓ నివేదిక పేర్కొంది.

Job searches for remote work surge in Feb-May: Report
'వర్క్​ ఫ్రం హోం' కోసం తెగ వెతికేస్తున్న భారతీయులు
author img

By

Published : May 24, 2020, 3:20 PM IST

కరోనా వైరస్​తో ఉద్యోగుల పని విధానాల్లో మార్పులొచ్చాయి. భౌతిక దూరం పాటించాల్సిన రావడం వల్ల అనేకమంది ఇళ్ల నుంచే పని చేస్తున్నారు. ఎక్కువ మంది ఈ విధానానికే మొగ్గు చూపుతున్నట్లు ఓ నివేదిక తెలిపింది. దేశంలో ఫిబ్రవరి నుంచి మే మధ్య కాలంలో ఈ తరహా ఉద్యోగాల కోసం అన్వేషించే వారి సంఖ్య.. 377 శాతం పెరిగిందని స్పష్టం చేసింది.

ఇళ్ల నుంచి పని చేయడాన్ని సాంకేతికంగా 'రిమోట్​ వర్క్​' అని కూడా అంటారు. 'రిమోట్'​, 'వర్క్​ ఫ్రమ్​ హోమ్​' సంబంధిత పదాలను.. భారతీయులు నెట్టింట తెగ వెతికేస్తున్నారని ఉద్యోగ వెబ్​సైట్ ​'ఇన్​డీడ్'​ పేర్కొంది. రిమోట్​ వర్క్​ కోసం గాలిస్తున్న వారు 377 శాతం పెరిగితే.. ఆ తరహా ఉద్యోగాలు అందించే వారు 168 శాతం పెరిగారని స్పష్టం చేసింది.

"కరోనా వైరస్​ వల్ల మనం పనిచేసే తీరును మార్చుకోవాల్సి వచ్చింది. ఫలితంగా రిమోట్​ వర్క్​కు ఆదరణ పెరిగింది. ఈ పరిస్థితి కొనసాగే అవకాశముంది. భవిష్యత్తు ఉద్యోగ వ్యూహాలను దృష్టిలో పెట్టుకుని పరిశ్రమలు ఆలోచించాలి.​"

--- శశి కుమార్​, ఇండీడ్​ ఇండియా ఎం​డీ.

కరోనా సంక్షోభానికి ముందు కూడా చాలా మంది 'వర్క్​ ఫ్రమ్​ హోమ్​' వైపే మొగ్గు చూపారు. గత నివేదికల ప్రకారం 83 శాతం మంది ఇంటి నుంచే పని చేయడానికి ఇష్టపడ్డారు. ఉద్యోగ అన్వేషణ సమయంలో దీనిని దృష్టిలో పెట్టుకున్నారు. 53 శాతం మంది ఉద్యోగులైతే.. ఇంటి నుంచి పనిచేయడం కోసం తమ జీతంలో కోత విధించినా ఫర్వాలేదని అభిప్రాయపడ్డారు. రిమోట్​ వర్క్​ ద్వారా ఉత్పత్తి కూడా పెరుగుతుందని 56 శాతం మంది ఉద్యోగులు, 83 శాతం మంది యజమానులు పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.