నిరుద్యోగులకు శుభవార్త! భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్‌బీఐ) 444 స్పెషలిస్టు ఆఫీసర్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు జులై 13లోగా దరఖాస్తు చేయాలని ప్రకటించింది. తమ వెబ్‌సైట్‌లో లాగిన్ అయి దరఖాస్తులు చేయొచ్చని సూచించింది.
దరఖాస్తు చేసే అభ్యర్థులు రెజ్యుమ్, గుర్తింపు, వయసు ధ్రువీకరణ పత్రాలు, విద్యార్హత, అనుభవానికి సంబంధించిన పత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఉద్యోగార్థులు ఎలాంటి పరీక్ష రాయనవసరం లేదు. ఎస్‌బీఐ కమిటీ అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి 100 మార్కులకు ముఖాముఖి నిర్వహిస్తుంది. అందులో అర్హత మార్కులను బ్యాంకు నిర్ణయిస్తుంది. ఏ ఇద్దరికైనా కటాఫ్ మార్కులు సమానంగా వస్తే వయసు ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ఇదీ చూడండి: జియోలో ఫేస్బుక్ పెట్టుబడికి సీసీఐ ఆమోదం