ETV Bharat / business

డౌన్​లోడ్​లో జియో జోరు​- అప్​లోడ్​లో.. - ఐడియా వొడాఫోన్​ డౌన్​లోడ్​ స్పీడ్​

4జీ ఇంటర్నెట్ సెగ్మెంట్‌లో రిలయెన్స్ జియో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. జూన్‌ నెలకు సంబంధించి 21.9 ఎంబీపీఎస్​ యావరేజ్ డౌన్‌లోడ్ స్పీడ్‌తో రిలయన్స్‌ జియోకు తొలిస్థానం దక్కింది. అప్‌లోడ్‌ సెగ్మెంట్‌లో 6.2 ఎంబీపీఎస్​ డేటా స్పీడ్‌తో వొడాఫోన్ ఐడియా అగ్రస్థానం సంపాదించింది.

jio, vodafone idea
జియో, వొడాఫోన్​
author img

By

Published : Jul 9, 2021, 10:08 PM IST

ఇంటర్నెట్‌ వేగం విషయంలో రిలయన్స్‌ జియో మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. 4జీ సెగ్మెంట్‌లో 21.9 మెగాబిట్‌ పర్‌ సెకండ్‌ సగటు వేగంతో టాప్‌లో నిలిచింది. అప్‌లోడ్‌ విషయంలో 6.2 ఎంబీబీపీఎస్‌ స్పీడ్‌తో వొడాఫోన్‌ ఐడియా మొదటి స్థానం సొంతం చేసుకుంది. ఈ మేరకు జూన్‌కు సంబంధించిన డేటాను టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ వెల్లడించింది.

డౌన్‌లోడ్‌ స్పీడ్‌విషయంలో వొడాఫోన్‌ ఐడియా 6.5 ఎంబీపీఎస్‌ సగటు వేగం అందిస్తుండగా.. జియో అంతకు మూడు రెట్ల వేగంతో డేటాను అందిస్తోంది. ఈ విషయంలో ఎయిర్‌టెల్‌ మూడోస్థానంలో నిలిచింది. 5ఎంపీబీఎస్‌ సగటు వేగాన్ని ఆ కంపెనీ నమోదు చేసినట్లు ట్రాయ్‌ పేర్కొంది. మైస్పీడ్‌ అప్లికేషన్‌ సాయంతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో సేకరించిన డేటా ఆధారంగా ఈ వివరాలను ట్రాయ్‌ ప్రతి నెలా వెల్లడిస్తుంది. ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్‌ పలు ప్రాంతాల్లో 4జీ సేవలను అందిస్తున్నప్పటికీ ట్రాయ్‌ డేటాలో పొందుపరచడం లేదు.

ఇదీ చూడండి: ఆ దేశంలో 'అలెక్సా'కు కొత్త చిక్కు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.