2018-19 ఆర్థిక సంవత్సరానికి ఆదాయ పన్ను రిటర్నులు (ఐటీఆర్) దాఖలు చేసేందుకు ఆగస్టు 31 వరకు గడువు పెంచింది. ఐటీఆర్ స్వయంగా దాఖలు చేయడం క్లిష్టమైన పని. ఇందుకు పట్టే సమయం కూడా ఎక్కువే. ఆదాయ పన్ను రిటర్నులను సులభంగా దాఖలు చేసేందుకు వీలుగా ఆదాయపు పన్నుశాఖ తన 'ఇ-ఫైలింగ్ వెబ్సైట్'లోనే 'ఇ-ఫైలింగ్ లైట్' పోర్టల్‌ను పొందుపరిచింది.
లైట్ వెర్షన్
ఆదాయపు పన్నుశాఖ వెబ్సైట్లో ఐటీఆర్.... ఇ-ఫైలింగ్‌కు సంబంధించి ఎలాంటి కార్యకలాపాలు చేయని పన్ను చెల్లింపుదారులకు ఈ కొత్త సౌకర్యం ఉపయోగపడుతుంది. ఆగస్టు 1 నుంచి వెబ్సైట్లో నమోదైన వినియోగదారులందరికీ ఇ-ఫైలింగ్ సదుపాయం ఉంటుంది. ఇది పొందేందుకు రెండు మార్గాలు ఉన్నాయి.
1. స్టాండర్డ్ విధానం: వివిధ రకాల ఆప్షన్లతో ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది.
2. లైట్ వెర్షన్: ఇది ఐటీఆర్ ఫైల్ చేసేందుకు మాత్రమే ఉద్దేశించినది.
పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్‌ను ఫైల్ చేసేందుకు ఈ రెండు సదుపాయాల్లో దేనినైనా వినియోగించుకోవచ్చు.
చాలా సులభంగా
ఆదాయపు పన్నుశాఖ ఇ-ఫైలింగ్ వెబ్సైట్ హోంపేజ్‌లో ఎడమవైపు 'క్విక్ ఐటీఆర్ ఫైలింగ్' పేరుతో ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్‌ను క్లిక్ చేయడం ద్వారా 'లైట్' పోర్టల్‌కు చేరుకోవచ్చు.
'లైట్' ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో మీరు ఐటీఆర్‌ను ఫైల్ చేసి, ఇ-వెరిఫికేషన్ ప్రాసెస్‌ను పూర్తి చేయవచ్చు. ప్రీ-ఫిల్ ఎక్స్ఎంఎల్ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా, ఫారం 26 ఎఎస్ (టీడీఎస్ కోసం), ఇ-ఫైల్ చేసిన ఆదాయపు పన్ను రిటర్న్‌లను తనిఖీ చేయవచ్చు. (ఎక్స్ఎంఎల్/ఐటీఆర్/ఐటీఆర్-వీ ఆప్షన్లను డౌన్లోడ్ చేసుకోనవసరం లేదు).
ఇ-ప్రొసీడింగ్, ఇ-నివారన్, కంప్లెన్స్, వర్క్‌లిస్ట్, ప్రొఫైల్ సెట్టింగ్స్ లాంటి ఇతర ఫీచర్ల కోసం ఇ-ఫైలింగ్ హోంపేజ్లోని 'పోర్టల్ లాగిన్' బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా పూర్తి వెర్షన్‌కు వెళ్లవలసి ఉంటుంది. అన్ని వర్గాల పన్ను చెల్లింపుదారులు సులభంగా, త్వరగా ఐటీఆర్ ఫైల్ చేసేందుకు 'లైట్' వెర్షన్ ప్రారంభించారు.
ఐటీఆర్ దాఖలు చేస్తే కలిగే లాభాలు సహా ఆన్లైన్లో సులువుగా రిటర్నులు దాఖలు చేసే విధానం కోసం ఈ వీడియో చూడండి....
ఇదీ చూడండి: చైనాకు 'కరెన్సీ మానిపులేటర్' ముద్ర వేసిన అమెరికా