ETV Bharat / business

It raid news: ఎన్​ఎస్​ఈ మాజీ సీఈఓ ఇంట్లో ఐటీ సోదాలు​ - ఎన్​ఎస్​ఈ మాజీ సీీఈఓ చిత్రా రామకృష్ణ

It raid news: పన్ను ఎగవేత కేసులో ఎన్​ఎస్​ఈ మాజీ సీఈఓ, ఎండీ చిత్రా రామకృష్ణ నివాసంలో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ముంబయిలోని ఇతర ప్రాంతాల్లో కూడా తనిఖీలు​ చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.

it ride news
చిత్రా రామకృష్ణ
author img

By

Published : Feb 17, 2022, 12:58 PM IST

Updated : Feb 17, 2022, 3:06 PM IST

It raid news: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్​ఎస్​ఈ) మాజీ ఎండీ చిత్రా రామకృష్ణ నివాసంలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆమెకు చెందిన ముంబయిలోని ఇతర ప్రాంతాల్లో కూడా సోదాలు చేపట్టారు. పన్ను ఎగవేత కేసులో ఐటీ రైడ్స్​ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

ఆనంద్‌సుబ్రమణియన్‌ను ఎన్‌ఎస్‌ఈ చీఫ్‌ స్ట్రాటజిక్‌ అడ్వైజర్‌గా నియమించడం, తిరిగి గ్రూప్‌ ఆపరేటింగ్‌ ఆఫీసరుగా, ఎండీ సలహాదారుగా మార్చడం వంటి విషయాల్లో పాలనా పరమైన అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో ఇటీవల వార్తల్లో నిచిచారు చిత్రా రామకృష్ణ.

చిత్రా రామకృష్టతో పాటు ఇతరులపై పన్ను ఎగవేత, ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఇవి మాత్రమే కాకుండా ఎన్ఎస్​ఈ ఆర్థిక, వ్యాపార ప్రణాళికలు, డివిడెండ్​లకు సంబంధించిన విషయాలతో పాటు ఆయా సంస్థల త్రైమాసిక ఫలితాల సమాచారం, ఇతర అంతర్గత సమాచారాన్ని ఆమె ఓ యోగితో పంచుకున్నారని పేర్కొన్నారు. దీనితో పాటే ఎక్స్ఛేంజ్ ఉద్యోగుల పనితీరు అంచనాలపై కూడా ఆయనను సంప్రదించారని చెప్పారు.

చిత్రా రామకృష్ణ ఎన్ఎస్​ఈకి 2013 ఏప్రిల్​ నుంచి 2016 డిసెంబర్​ వరకు ఎండీ, సీఈఓగా బాధ్యతలు నిర్వహించారు.

ప్రధాని, ఆర్థిక మంత్రి మౌనంపై కాంగ్రెస్​ ప్రశ్నలు..

ఎన్​ఎస్​ఈ మాజీ ఎండీపై ఐటీ దాడుల నేపథ్యంలో కాంగ్రెస్​ స్పందించింది. ఎన్​ఎస్​ఈ పనితీరుపై ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించింది.

ఒక బాబానే నేషనల్​ స్టాక్​ ఎక్స్చేంజిని నడిపించారనే అంశాన్ని కాంగ్రెస్​ ఫిబ్రవరి 15నే లేవనెత్తిందని రణ్​దీప్​ సుర్జేవాలా ట్విట్టర్​ వేదికగా పేర్కొన్నారు. ఆదాయపు పన్ను శాఖ ఆలస్యంగా మేల్కొందని ఆయన ఆరోపించారు. రూ. 300 లక్షల కోట్ల మార్కెట్​ క్యాప్​ ఉన్న ఈ బోర్డును ఒక బాబా ఎక్కడో ఉండి ఎలా నడిపించారని ప్రశ్నలు సంధించారు. ఆ బాబా ఎక్కడున్నాడో? ఎవరో.. ప్రధాని, ఆర్థిక మంత్రి సమాధానం చెప్పాలని అన్నారు.

ఇదీ చూడండి:

'చిత్రా.. నీ కురులు సూపర్'.. బాబాజీ ఇ-మెయిళ్లు లీక్!

ఈపీఎఫ్‌కు మార్కెట్‌ అండ- ఈక్విటీలపై మెరుగైన లాభాలు

Last Updated : Feb 17, 2022, 3:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.