ETV Bharat / business

కొవిడ్‌ వచ్చినా కొలువులు భద్రమే! - ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం

కరోనా వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. ఇలాంటి సమయాల్లో ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా ఈ ప్రభావం ఐటీ రంగంపై ఎక్కువగా ఉంటుందని పలువురు అంచనా వేస్తున్నారు. అయితే ఐటీ రంగ నిపుణులు మాత్రం వాటన్నింటిని కొట్టిపారేస్తున్నారు. కేవలం 5 శాతం ఉద్యోగాలకే ముప్పు ఉందని.. అది కూడా ఎప్పటికప్పుడు నైపుణ్యాలు పెంచుకోని వారికే సమస్య అని చెబుతున్నారు.

CORONA IMPACT ON IT JOBS
ఐటీ ఉద్యోగాలపై కరోనా ప్రభావం
author img

By

Published : Apr 7, 2020, 9:14 AM IST

కొవిడ్ కారణంగా ఇటీ కొలువుల్లో కోత భారీగా ఉంటుందన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదంటున్నారు ఆ రంగంలోని నిపుణులు. ఎప్పటికప్పుడు సాంకేతికతను అందిపుచ్చుకుంటే ఎలాంటి భయమక్కర్లేదని భరోసానిస్తున్నారు. ఈ రంగంలోని ప్రవేశించి జీవితంలో స్థిరపడ్డాం అని భావించి ఎలాంటి నూతన సాంకేతికతలపై దృష్టిసారించని వారికి మాత్రం ఇబ్బంది తప్పదంటున్నారు. కళాశాలల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి మంచి ప్యాకేజీలతో ఉద్యోగాల్లో చేరి.. అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోలేని వారు ఇక మేలుకోకపోతే చతికిలపడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

కృత్రిమ మేధ కాలం నడుస్తున్న ఈరోజుల్లో ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవడానికి అలవాటు పడకపోవడం ఐటీ ఉద్యోగాలపై ప్రభావం చూపుతోంది. కృత్రిమ మేధస్సు (ఏఐ), ఆటోమేషన్‌, మెషీన్‌ లెర్నింగ్‌, 5జీ... వంటి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో వస్తున్న ఫలితంగా పాత ఉద్యోగుల అవసరం అంతగా ఉండదు. అందుకే తొలగింపు అనివార్యం అవుతోందని స్థానిక ఐటీ వర్గాలు వివరిస్తున్నాయి.

గడ్డుకాలం మరి.. మేల్కోవాలి..

గతేడాదికి సంబంధించిన పనితీరును సంస్థలు మార్చి నుంచి మే నెల వరకు అంచనా వేస్తాయి. దానిలో ప్రతిభను బట్టి రేటింగులు కేటాయించి వారిని తీసేయడమా, ఉంచడమా చేస్తాయి. ఇప్పుడు సంస్థలపై కొవిడ్‌-19తో నష్టాల భారం పడుతోంది. యూఎస్‌ లాంటి దేశాల నుంచి ప్రాజెక్టులు రాకపోవడ వల్ల నష్ట నివారణ చర్యలు చేపడుతున్నాయి. కొన్ని సంస్థలు వేరియబుల్‌ పేల్లో మాత్రమే కోత విధిస్తున్నాయి. ఇంకొన్ని సంస్థలు పనితీరు బాగాలేని ఉద్యోగులను తొలగించే ఆలోచనల్లో ఉన్నాయి. క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్ల ప్రక్రియలో కొత్తగా చేర్చుకునే వారి విషయంలోనూ అవి వెనకడుగు వేస్తున్నాయి.

క్వారంటైన్‌నూ వృథా చేయొద్దు

క్వారంటైన్‌నూ సద్వినియోగం.. ఐటీలో కొత్తగా వస్తున్న సాంకేతికతల్ని నేర్చుకునేందుకు ఈ క్వారెంటైన్‌ సమయం మంచిదని చెబుతున్నారు నిపుణులు. కార్యాలయాల్లో పనిచేసే సమయంలో కొత్తవాటిపై ధ్యాస పెట్టే సమయం ఉండదు. అదే ఇంటి నుంచి పనిలో అటు పనితోపాటు కొత్త లాంగ్వేజ్‌లను నేర్చుకునే అవకాశమూ ఉందంటున్నారు. ఎప్పటికప్పుడు మెరుగు పరుచుకుంటేనే ఉద్యోగాలకు భద్రత అని హెచ్చరిస్తున్నారు.

ఇదీ చూడండి:ఆ మందుల ఎగుమతిపై నిషేధం ఎత్తివేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.