ETV Bharat / business

ఆ మందుల ఎగుమతిపై నిషేధం ఎత్తివేత

ఇటీవల నిషేధం విధించిన 26 రకాల యాక్టివ్​ ఫార్మీసూటికల్ ఇంగ్రీడెంట్స్(ఏపీఐ)​ ఎగుమతులను కేంద్రం సడలించింది. వాటిలో 24 రకాల ఏపీఐల ఎగుమతికి అనుమతిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.

Govt eases export curbs on pharma ingredients
ఔషధాల ఎగుమతిపై నిషేధం ఎత్తివేత
author img

By

Published : Apr 7, 2020, 7:55 AM IST

Updated : Apr 7, 2020, 10:14 AM IST

విటమిన్ బీ1, బీ12 సహా 24 ఫార్మా పదార్థాలు, ఔషధాల ఎగుమతిపై కేంద్రం నిషేధం ఎత్తివేసింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కొన్ని ఔషధాలపై నిషేధం ఎత్తివేసినప్పటికీ.. పారాసిటమాల్​, పారాసిటమాల్ ఫార్ములేషన్లపై నిషేధం కొనసాగుతుందని డైరెక్టర్​ జనరల్ ఆఫ్​ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్​టీ)​ స్పష్టం చేసింది.

26 రకాల యాక్టివ్​ ఫార్మీసూటికల్ ఇంగ్రీడెంట్స్(ఏపీఐ)​ ఎగుమతిపై మార్చి 3న నిషేధం విధించింది డీజీఎఫ్​టీ. వాటిలో ఇప్పుడు 24 ఔషధాలు, ఫార్ములేషన్లపై బ్యాన్​ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది.

గత ఏడాది మొత్తం మీద చూస్తే భారత్​ 225 మిలియన్​ డాలర్ల విలువైన ఏపీఏలను ఎగుమతి చేసింది.

మన దేశం ఏడాదికి 3.5 బిలియన్ డాలర్లు విలువైన ఏపీఐలను దిగుమతి చేసుకుంటుంది. అందులో 2.5 బిలియన్ డాలర్లు విలువైనవి చైనా నుంచే దిగుమతి చేసుకుంటుండటం గమనార్హం.

ఇదీ చూడండి:ఆహారం లభించే వివరాలు ఇక గూగుల్‌ మ్యాప్స్‌లో!

Last Updated : Apr 7, 2020, 10:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.