ETV Bharat / business

'భిన్నమైన పోకడ వల్లే దేశంలో అగ్రస్థానం'

'ఫైనాన్షియల్‌ టైమ్స్‌ గ్లోబల్‌ ఎంబీఏ ఇన్‌స్టిట్యూట్స్‌ ర్యాంకింగ్‌ 2021’ జాబితాలో ఐఎస్‌బీ మన దేశంలో అగ్రస్థానంలో నిలిచింది. అంతేగాక ఆసియాలో 5వ స్థానాన్ని, ప్రపంచ జాబితాలో 23వ స్థానాన్ని దక్కించుకుంది. ఇందుకుగల కారణాలను ఆ సంస్థ సీనియర్‌ అసోసియేట్‌ డీన్‌ ప్రొఫెసర్‌ రామభద్రన్‌ ఎస్‌.తిరుమలై 'ఈనాడు'తో పంచుకున్నారు.

ISB
మాది భిన్నమైన పోకడ
author img

By

Published : Feb 19, 2021, 7:41 AM IST

స్వల్పకాలంలోనే మేనేజ్‌మెంట్‌ విద్యలో సత్తా చాటిన ఘనత ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) సొంతం. ఫైనాన్షియల్‌ టైమ్స్‌ (ఎఫ్‌టీ) ఇటీవల ప్రకటించిన ‘ఫైనాన్షియల్‌ టైమ్స్‌ గ్లోబల్‌ ఎంబీఏ ఇన్‌స్టిట్యూట్స్‌ ర్యాంకింగ్‌ 2021’ జాబితాలో ఐఎస్‌బీ మన దేశంలో అగ్రస్థానంలో నిలిచింది. అంతేగాక ఆసియాలో 5వ స్థానాన్ని, ప్రపంచ జాబితాలో 23వ స్థానాన్ని దక్కించుకుంది. తాము అనుసరించే విభిన్నమైన విద్యా విధానాలే ఈ ఘనతకు కారణమని ఐఎస్‌బీ సీనియర్‌ అసోసియేట్‌ డీన్‌ ప్రొఫెసర్‌ రామభద్రన్‌ ఎస్‌.తిరుమలై 'ఈనాడు ఇంటర్వ్యూ'లో వివరించారు.

"మేం పాఠాలు చెప్పటం, విద్యార్థులు నోట్స్‌ రాసుకోవటం.. కాకుండా, మా విద్యార్థులు ప్రశ్నిస్తూ- పరిశోధిస్తూ.. ముందుకు సాగుతారు. రేపటి ప్రపంచంలో పోటీని తట్టుకొని నిలిచే విధంగా రాటుతేలుతారు. అదే ఐఎస్‌బీని అత్యున్నత మేనేజ్‌మెంట్‌ విద్యా సంస్థగా నిలబెడుతోంది’’ అని అన్నారాయన. సాధించిన దానితో సంతృప్తి చెందకుండా ఇంకా ఉన్నత స్థానాలకు చేరుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఇంటర్వ్యూ విశేషాలు..
'ఫైనాన్షియల్‌ టైమ్స్‌ గ్లోబల్‌ ఎంబీఏ ఇన్‌స్టిట్యూట్స్‌ ర్యాంకింగ్‌ 2021' జాబితాలో ఐఎస్‌బీ దేశంలో అగ్రస్థానం సాధించింది. దీన్ని మీరెలా చూస్తున్నారు?
ఐఎస్‌బీకి ఇదెంతో గౌరవం, గర్వకారణం. ఫ్యాకల్టీ, విద్యార్థులు, సిబ్బంది.. అందరూ కృషి చేయడంతోనే ఉన్నత స్థానంలో నిలిచే అవకాశం దక్కింది. ఈ ప్రయాణంలో ఐఎస్‌బీ గవర్నింగ్‌ బోర్డు అండగా నిలిచింది. మనదేశంలో మేనేజ్‌మెంట్‌ విద్య కొత్త పుంతలు తొక్కటానికి ఐఎస్‌బీకి లభించిన గుర్తింపు దోహదపడుతుందని చెప్పగలను.
ఇంకా పెద్ద లక్ష్యాలు నిర్దేశించుకున్నారా?
ఎప్పటికప్పుడు ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకొని వాటిని సాధించటానికి కృషి చేస్తున్నాం. మేనేజ్‌మెంట్‌ విద్యలో ఐఎస్‌బీ, మనదేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలనేది మా సంకల్పం. ఈ దిశగా కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతున్నాం. ఉదాహరణకు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కొవిడ్‌-19 మహమ్మారికి వెంటనే స్పందించి 'డిజిటల్‌ హెడ్‌స్టార్ట్‌ మాడ్యూల్‌' ఆవిష్కరించాం. దీని వల్ల పాఠ్యాంశాలకు మాత్రమే పరిమితం కాకుండా, నాయకత్వ లక్షణాలను ఎలా పుణికిపుచ్చుకోవాలి, అనిశ్చితితో కూడిన ప్రస్తుత పరిస్థితుల్లో కెరీర్‌ లక్ష్యాలను ఎలా చేరుకోవాలి.. అనే అంశాలపై విద్యార్ధులను తీర్చిదిద్దేందుకు, ఐఎస్‌బీ పూర్వవిద్యార్థులతో సంప్రదింపులు చేపట్టేందుకు వీలుకలిగింది. ఇటువంటి ఎన్నో ప్రయోగాలను ఐఎస్‌బీ ఆవిష్కరిస్తోంది.
మనదేశంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఎన్నో ఏళ్ల నాటి మేనేజ్‌మెంట్‌ విద్యా సంస్థలు ఉన్నాయి. వాటితో పోటీపడి ఎలా మిన్నగా నిలవగలుగుతున్నారు?
ఐఎస్‌బీ నిర్మాణంలోనే ప్రత్యేకత ఉంది. దేశంలోని వ్యాపార ప్రముఖులను భాగస్వాములను చేయటం, ప్రపంచ స్థాయి మేనేజ్‌మెంట్‌ నిపుణులను తీసుకురావటం, ప్రస్తుత- భవిష్యత్తు వ్యాపార ముఖచిత్రంపై విద్యార్థులకు అవగాహన కల్పించటం.. వంటి ప్రయోగాలతో ఇతర మేనేజ్‌మెంట్‌ విద్యా సంస్థలతో పోల్చితే భిన్నమైనదిగా ఐఎస్‌బీ రూపుదిద్దుకుంటోంది. ఉద్యోగానుభవం ఉన్న వారినే ఐఎస్‌బీ పీజీపీ (పీజీ ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌) లో చేర్చుకుంటున్నందున, చెప్పింది వినటం- రాసుకోవటం కాకుండా ప్రశ్నించే శక్తియుక్తులు ఉన్న విద్యార్థులు వస్తున్నారు. అదే సమయంలో ఆరోగ్యం-సంరక్షణ, ప్రభుత్వ విధానాలు, ఐటీ, డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌, డేటా సైన్స్‌, ఫైనాన్స్‌, పరిశోధన.. వంటి విభాగాల్లో ఏర్పాటు చేసిన పరిశోధనా కేంద్రాల వల్ల ప్రత్యేక నైపుణ్యాలు సంతరించుకునే అవకాశం విద్యార్థులకు లభిస్తోంది. ఐఎస్‌బీకి 'ఐఎస్‌బీ అల్యూమినీ' పెద్ద అండ. అల్యూమినీలో 12,000 మందికి పైగా పూర్వ విద్యార్థులు ఉన్నారు. సిలికాన్‌ వ్యాలీ నుంచి లండన్‌, దుబాయ్‌, సింగపూర్‌, హాంగ్‌కాంగ్‌లో పనిచేస్తున్న ఎంతో మంది సీఎఫ్‌ఓలు, సీఎక్స్‌ఓలు, చీఫ్‌ మార్కెటింగ్‌ అధికార్లు మా పూర్వవిద్యార్థులే.
అత్యుత్తమ మేనేజ్‌మెంట్‌ విద్యా సంస్థల జాబితాలో మనదేశం నుంచి ఎక్కువ సంస్థలు స్థానం సంపాదించటానికి, మెరుగైన ర్యాంకులు సాధించటానికి ఏ మేరకు అవకాశాలు ఉన్నాయి?
ఈసారి ఫైనాన్షియల్‌ టైమ్స్‌ టాప్‌-100 జాబితాలో మనదేశం నుంచి ఐదు విద్యా సంస్థలు ఉన్నాయి. పదేళ్ల క్రితం ఈ జాబితాలో ఐఎస్‌బీ ఒక్కటే కనిపించేది. ఇప్పుడు సంఖ్య పెరిగింది. భవిష్యత్తులో ఇంకా పెరుగుతుంది. ప్రపంచ మేనేజ్‌మెంట్‌ విద్యా రంగంలో మనం క్రియాశీలకమైన పాత్ర పోషించే రోజు ఎంతో దూరంలో లేదు.
మేనేజ్‌మెంట్‌ నిపుణులను తయారు చేయటమే కాకుండా ఐఎస్‌బీ సమాజానికి ఇంకేమైనా మేలు చేస్తోందా?
వైద్య రంగంలో సేవలు అందించేందుకు వీలుగా మా వద్ద మాక్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌ ఉంది. వైద్య సేవల రంగంలో స్థితిగతులను విశ్లేషించి ఉన్నత ప్రమాణాలు నెలకొల్పేందుకు అవసరమైన సలహాలు, సేవలు దీనిద్వారా అందిస్తున్నాం. భారతీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీ ద్వారా ప్రభుత్వ పాలన పద్ధతులకు సంబంధించి ప్రగతిశీల విధానాలను ఆవిష్కరిస్తున్నాం.
ఐఎస్‌బీలో ఫీజు ఎంతో అధికం.. అనే విమర్శ ఉంది. మెరిట్‌ ఉన్నప్పటికీ పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులు భరించలేరని అంటారు?
అది నిజం కాదు. రెండేళ్ల ఎంబీఏ కోర్సు అందించే ఎన్నో విద్యా సంస్థలతో పోల్చితే ఐఎస్‌బీ ఫీజు భారం ఏమీ కాదు. అంతేగాక స్కాలర్‌షిప్‌లు, కొన్ని రాయితీలు అందిస్తున్నాం. చదువు పూర్తికాగానే విద్యార్ధులకు మంచి జీతభత్యాలతో ఉద్యోగాలు వస్తున్నాయి. తొలుత ఫీజు కొంత భారం అనిపించినప్పటికీ ఆ తర్వాత విద్యార్థులు ఎంతో తక్కువ సమయంలోనే ఉన్నత స్థానాలకు చేరుకునే అవకాశం ఉంది.

ఇదీ చూడండి: 'కొవిడ్​తో ఆరోగ్యంపై అవగాహన, ఆరోగ్య బీమా పట్ల చైతన్యం పెరిగాయి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.