ETV Bharat / business

'సరళ్​ జీవన్​ బీమా' ప్రారంభమయ్యేది అప్పుడే! - Saral Jeevan Bima benefits

పాలసీ ఎంపికను సులభతరం చేసేందుకు తీసుకొచ్చిన 'సరళ్​ జీవన్​ బీమా'ను అన్ని సంస్థలు వచ్చే ఏడాది ఆరంభంలోపు ప్రారంభించాలని ఐఆర్​డీఏఐ కోరింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది బీమా నియంత్రణ సంస్థ.

IRDAI asks life insurers to launch 'Saral Jeevan Bima' scheme by Jan 1
'వచ్చే ఏడాది ఆరంభంనాటికి 'సరళ్​ జీవన్​ బీమా' అమలు!'
author img

By

Published : Oct 16, 2020, 5:13 AM IST

దేశంలోని అన్ని ఇన్సూరెన్స్​ సంస్థలు 'సరళ్​ జీవన్​ బీమా'ను 2021 జనవరి 1లోగా ప్రారంభించాలని కోరింది భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్​డీఏఐ). ఈ మేరకు ఆయా బీమా సంస్థలకు మార్గదర్శకాలను విడుదల చేసింది ఐఆర్​డీఏఐ.

ఈకొత్త పాలసీని అనుమతిపొందిన అన్ని జీవిత బీమా సంస్థలు అందిస్తాయని ఐఆర్​డీఏఐ మార్గదర్శకాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న పాలసీల్లో విభిన్న నిబంధనలు, షరతుల కారణంగా ఎంపిక సమయంలో వినియోగదారులు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు ఈ బీమాను తీసుకొచ్చింది ఐఆర్​డీఏఐ.

లింగ బేధం, నివాస స్థలం, వృత్తి, విద్యార్హతలు వంటివాటితో సంబంధం లేకుండా.. అందరికీ ఈ బీమా వర్తించనుంది. ఈ పాలసీతో బీమా సంస్థలు, వినియోగదారుల మధ్య నమ్మకాన్ని బలపడుతుందని ఆశాభావం వ్యక్తంచేసింది.

బీమా వివరాలు ఇవే..

  • 18 నుంచి 65 ఏళ్ల వయసు కలిగి ఉన్నవారందరు అర్హులు
  • కాల వ్యవధి: కనిష్ఠంగా నాలుగేళ్లు-గరిష్ఠంగా 40ఏళ్లు
  • బీమా మొత్తం - రూ. 5లక్షల నుంచి రూ. 25లక్షల వరకు..

ఎంతో ప్రయోజనకారి..

'సరళ్​ జీవన్​ బీమా' విధానం దేశ అవసరాలకు అనుగుణంగా ఉంటుందని బజాజ్​ అలియాంజ్​ లైఫ్​ ఇన్సూరెన్స్​ చీఫ్ భరత్​ కలాసి అన్నారు. బీమా ప్రణాళికలపై మరింత అవగాహన పెంచేందుకు సాయపడే ఈ పాలసీని తాము స్వాగతిస్తున్నట్టు చెప్పారు. ఇది వినియోగదారులకు మరింత ప్రయోజకరంగా ఉంటుందన్నారు.

ఈ బీమా విధానాన్ని 'భారత్​' పాలసీగా పరిగణించారు 'పాలసీబజార్​.కామ్​' లైఫ్​ ఇన్సూరెన్స్​ బ్రాండ్​ అధికారి(సీబీఓ) సంతోష్​ అగర్వాల్​. ఇప్పటివరకూ ఎలాంటి బీమా చేయనివారు 'సరళ్​ జీవన్​ పాలసీ'ను ఎంచుకోవడం ఉత్తమమని ఆయన సూచించారు.

ఇదీ చదవండి: వైద్య బీమా పాలసీలకు రంగులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.