కరోనా వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులను ఆగస్టు 31 వరకు రద్దు చేస్తున్నట్లు తెలిపింది డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ). ఈ మేరకు ఓ ప్రకటన వెలువరించింది.
కరోనా కట్టడిలో భాగంగా మార్చి 23 నుంచి అన్ని అంతర్జాతీయ సర్వీసులు నిలిపివేసింది డీజీసీఏ. ఆ తర్వాత దాన్ని జులై 31 వరకు.. తాజాగా ఆగస్టు 31వరకు పొడిగించింది.