ETV Bharat / business

డొనాల్డ్ ట్రంప్​, ముకేశ్ అంబానీ మధ్య ఆసక్తికర చర్చ - సీఈఓలతో ట్రంప్

భారత పర్యటనలో భాగంగా వాణిజ్య ప్రతినిధులతో భేటీ అయ్యారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అమెరికాలో భారతీయ కంపెనీలకు అనుమతుల విషయాన్ని రిలయన్స్ అధినేత ముకేశ్​ అంబానీ ప్రస్తావించగా ట్రంప్​ సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వాలు ఉద్యోగమిస్తే.. ప్రైవేట్​ సంస్థలు సృష్టిస్తాయని పేర్కొన్నారు.

BIZ-US-CEO
ట్రంప్​ అంబానీ
author img

By

Published : Feb 25, 2020, 5:09 PM IST

Updated : Mar 2, 2020, 1:11 PM IST

ట్రంప్​ అంబానీ మధ్య ఆసక్తికర చర్చ

దిల్లీలో భారత సీఈఓలు, వాణిజ్య ప్రతినిధులతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ అయ్యారు. దేశంలోని ప్రముఖ వాణిజ్య సంస్థల అధినేతలు ముకేశ్​ అంబానీ(రిలయన్స్​), ఆనంద్​ మహీంద్ర(మహీంద్ర అండ్ మహీంద్ర), ఎన్​ చంద్రశేఖరన్​(టాటా సన్స్​), కుమార మంగళం బిర్లా(బిర్లా గ్రూప్​) తదితరులు హాజరయ్యారు.

ట్రంప్​తో పలు విషయాలు చర్చించారు రిలయన్స్​ ఇండస్ట్రీస్​ అధినేత ముకేశ్​ అంబానీ. అమెరికా చొరవతోనే కార్పొరేట్​ పన్ను రేట్లు భారత్​లో తగ్గాయని ట్రంప్​కు తెలిపారు.

"మేం అమెరికా ఇంధన రంగంలో 7 బిలియన్​ డాలర్లు పెట్టుబడి పెట్టాం. నేను మీకు వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలపాలి. మీరు అమెరికాలో చేసిన కృషినే కాదు.. మీ చొరవతో దేశంలో కార్పొరేట్​ పన్నులను తగ్గిస్తూ ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారు. అలాగే భారతీయ కంపెనీలకు అనుమతుల ప్రక్రియను సులభతరం చేశారు. ఇది కొనసాగాలని మేం కోరుకుంటున్నాం."

-ముకేశ్​ అంబానీ, రిలయన్స్ అధినేత

ముకేశ్​ అంబానీ చేసిన విజ్ఞప్తిపై ట్రంప్ సానుకూలంగా స్పందించారు. అమెరికాలో 7 బిలియన్​ డాలర్ల పెట్టుబడి పెట్టినందుకు సంతోషం వ్యక్తం చేశారు.

"నేను అధ్యక్షుడిగా ఉన్నంతవరకు ఇది కొనసాగుతుంది. మళ్లీ నేను ఎన్నిక కాకపోతే ఉంటుందో ఉండదో చెప్పలేం. మీరు చేసిన కృషి మాత్రం చాలా గొప్పది."

-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

వాణిజ్య ప్రతినిధులతో చర్చను ప్రారంభించడానికి ముందు పలు విషయాలపై ట్రంప్ మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ ఎంత మంచివారో.. అంతటి ఘటికులని ప్రశంసించారు. కంపెనీల ఏర్పాటుకు సంబంధించి మరిన్ని నిబంధనలను సరళీకరిస్తామని ట్రంప్ తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగమిస్తే.. ప్రైవేట్​ సంస్థలు సృష్టించగలవని అన్నారు.

కరోనా వైరస్​ వ్యాప్తిని తగ్గించేందుకు చైనా కృషిని అభినందించారు ట్రంప్​. ప్రస్తుతానికి పరిస్థితులు పూర్తి నియంత్రణలోనే ఉన్నాయని.. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు. కరోనా వైరస్​ను ఎదుర్కొనేందుకు 2.5 బిలియన్​ డాలర్లను ఖర్చుచేయనున్నట్లు తెలిపారు.

Last Updated : Mar 2, 2020, 1:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.