ETV Bharat / business

కరోనా మరణాలకూ బీమా పరిహారం చెల్లింపు! - జీవిత బీమా మండలి

ప్రభుత్వ, ప్రైవేట్ బీమా సంస్థలు అన్నీ కరోనా మరణాల క్లయిమ్​లను పరిష్కరించాల్సిందేనని జీవిత బీమా మండలి స్పష్టం చేసింది. కొవిడ్​-19 మరణాల క్లెయిమ్​ల విషయంలో 'ఫోర్స్ మెజర్​' నిబంధన వర్తించదని స్పష్టం చేసింది.

Insurers cannot decline death claim settlement in case of Coronavirus
కరోనా మరణాలకూ బీమా పరిహారం చెల్లించాల్సిందే
author img

By

Published : Apr 6, 2020, 3:54 PM IST

బీమా సంస్థలు కరోనా మరణాల క్లెయిమ్​లను కూడా పరిష్కరించాల్సిందేనని లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ తేల్చిచెప్పింది. కొవిడ్-19 మరణ దావాల విషయంలో 'ఫోర్స్ మెజర్' నిబంధన వర్తించదని స్పష్టం చేసింది.

వేగంగా పరిష్కరించాలి..

కొవిడ్-19తో చనిపోయిన వారి క్లెయిమ్​లను... ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలన్నీ అత్యంత వేగంగా పరిష్కరించాలని జీవిత బీమా మండలి ఆదేశించింది. ముందుగా తెలియని, నియంత్రించలేని పరిస్థితులకు 'ఫోర్స్ మెజర్​'ను అమలు చేస్తారు. కరోనా మరణాలకు దీనిని వర్తింపజేయడం లేదని జీవిత బీమా మండలి స్పష్టం చేసింది.

ఎంతో మంది వినియోగదారులు ఈ విషయంలో స్పష్టత కోసం బీమా సంస్థల చుట్టూ తిరుగుతున్నారని పేర్కొంది. ఈ నిబంధనపై వివాదాలు, వదంతులకు తావులేదని జీవిత బీమా మండలి స్పష్టం చేసింది. బీమా సంస్థలను ఈ విషయాన్ని తమ వినియోగదారులకు వ్యక్తిగతంగా తెలియజేయాలని ఆదేశించింది.

"ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న వైనం... ఇంట్లో ప్రతి ఒక్కరికి జీవిత బీమా ప్రాథమిక అవసరమని నొక్కి చెబుతోంది. లాక్​డౌన్​ వల్ల వినియోగదారులకు కలుగుతున్న అంతరాయాన్ని తగ్గించేందుకు జీవిత బీమా రంగం అన్ని చర్యలూ తీసుకుంటోంది. కరోనా మరణాల క్లెయిమ్​లతో సహా ఎన్నో సేవలను డిజిటల్ రూపంలో అందజేస్తున్నాం. ఈ క్లిష్ట సమయంలో బీమా సంస్థలన్నీ తమ వినియోగదారులకు అండగా నిలవాలి. తప్పుడు సమాచారం, వదంతలు వ్యాపించకుండా చూడాలి."

-ఎస్​.ఎన్​ భట్టాచార్య, జీవిత బీమా మండలి సెక్రటరీ జనరల్​

ఇంతకు ముందు జీవిత బీమా పాలసీదారుల ప్రీమియం చెల్లింపు గడువును 30 రోజుల పాటు ఐఆర్​డీఏఐ పెంచింది. ఫలితంగా మార్చి, ఏప్రిల్ నెలల ప్రీమియం చెల్లించాల్సిన పాలసీదారులకు కాస్త ఉపశమనం కలిగినట్లైంది.

ఇదీ చూడండి: 28 శాతం తరిగిపోయిన ముకేశ్​ అంబానీ ఆస్తులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.