ETV Bharat / business

వాహన బీమాలో తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..

వర్షాకాలం వచ్చింది. కొద్ది పాటి వానకే రోడ్లపైకి నీరు చేరడం ఇటీవల సర్వసాధారణమైపోయింది. వర్షాలు, వరదలతో కొన్నిసార్లు వాహనాలు నీట మునగడం వంటివి జరుగుతుంటాయి. దీనివల్ల ఇంజిన్​ చెడిపోయి రిపేర్​ చేయించాల్సి వస్తుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో బీమా వర్తిస్తుందా? బీమా వర్తించాలంటే ఏం చేయాలి? వర్షాకాలంలో బీమా వర్తించే ప్లాన్లు ఏవీ? అనే విషయాలు మీ కోసం.

vehicle insurance In Mansoon
వాహన బీమాలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
author img

By

Published : Jun 28, 2020, 9:45 AM IST

వర్షాకాలంలో నీరు రోడ్లపైకి చేరడం సహా.. భారీ వానలకు వరదలు వస్తుంటాయి. వరదలు వచ్చినప్పుడు వాహనాలు పాక్షికంగా, కొన్నిసార్లు పూర్తిగా మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. వాహనాలు నీట మునగడం వల్ల.. మరమ్మతులు(రిపేర్​) చేయాల్సిఉంటుంది. ముఖ్యంగా నీట మునిగిన వాహనాలకు ఇంజిన్​ రిపేర్లు అవసరమవుతుంటాయి.

వాహనానికి బీమా ఉంది కదా అని.. క్లెయిమ్​ చేసుకుందామంటే.. అందుకు బీమా సంస్థలు అంగీకరించవు. ఎందుకంటే ప్రమాదాలకు మాత్రమే బీమా ఇస్తామని, నీటమునగడం ప్రమాదంగా పరిగణించమని చెబుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాహనదారుడు సొంతంగా ఇంజిన్ రిపేర్​ చేయించుకోవాల్సి వస్తుంది. ఇంజిన్ కాబట్టి ఖర్చు మోపెడు అవుతుంది. అయితే కొన్ని చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి సమస్యలు రాకుండా.. వరదలో మునిగిన వాహనానికీ బీమా వర్తించేలా చూసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

రోడ్​ సైడ్ అసిస్టెన్స్ కవర్..

వాహనం వరద నీటిలో మునిగితే.. అందులో నీళ్లు వెళ్లిపోయే వరకు వేచి ఉండాలి. బీమా కంపెనీకి ఈ విషయాన్ని చేరవేయాలి. దీని ద్వారా మీరు ఎలాంటి చర్యలు తీసుకోవాలో కంపెనీ సలహాలు ఇస్తుంటుంది. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో వాహనాన్ని పరిశీలించేందుకు దగ్గరలోని గ్యారేజీకి తీసుకెళ్లాలని కంపెనీలు సూచిస్తుంటాయి. అయితే దీనికయ్యే ఖర్చు వినియోగదారుడే భరించాల్సి ఉంటుంది. 'రోడ్ సైడ్ అసిస్టెన్స్ కవర్' ఉన్నట్లయితే ఈ ఖర్చు తప్పుతుంది.

నీటిమునిగిన వాహనాన్ని స్టార్ట్​ చేసేందుకు ప్రయత్నించకూడదు. అంతే కాకుండా స్థానిక మెకానిక్​లతో రిపేర్​ చేయించకూడదు.

వాటికి బీమా వర్తించదు...

భారీ వరదల కారణంగా వాహనం పూర్తిగా నీటమునిగితే.. క్యాబిన్​లోకి నీరు చేరుతుంది. ఫలితంగా.. అందులో ఉండే సెన్సర్​లు, స్పీకర్లు సహా ఇతర ఎలక్ట్రానిక్​ ఉపకరణాలు ఏమైనా ఉంటే పాడవుతాయి. ఇలాంటి సందర్భాల్లో బీమా క్లెయిమ్​ అయినా.. అలాంటి ఉపకరణాలకు బీమా వర్తించదు. కేవలం కంపెనీ నుంచి వచ్చిన వాటికి మాత్రమే బీమా కల్పిస్తాయి. ఇలాంటి సమస్యలు రాకుండా 'యాడ్​ ఆన్​'లు తీసుకోవడం మంచిది. వీటితో ఉపకరణాలకు బీమా వర్తిస్తుంది. వరదలు ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో ఉన్న వారు ఈ యాడ్ ఆన్స్ తప్పనిసరిగా తీసుకోవటం మంచిది.

అనుకోని వరదలు..

ప్రయాణం మధ్యలో ఉన్నా.. లేదా ఎక్కడైనా సురక్షిత ప్రాంతాల్లో పార్క్ చేసి వెళ్లినా.. అకస్మాత్తుగా వరదలు రావడం వల్ల కార్ పాక్షికంగా మునిగి రిపేర్​ వస్తే అందుకు కొన్నిసార్లు బీమా వర్తిస్తుంది. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులను ప్రమాదాలుగానే గుర్తిస్తాయి బీమా కంపెనీలు.

అయితే ఇలాంటి సందర్భాల్లో వాహనం నిలిచిపోతే.. ఎక్కువ సార్లు స్టార్ట్ చేయడానికి ప్రయత్నించొద్దు. వీలైనంత త్వరగా ఆ విషయాన్ని బీమా సంస్థకు తెలపాలి.

ఎక్కడైనా లోతట్టు ప్రాంతాల్లో కార్​పార్క్ చేస్తే బీమా వర్తించదు. ఎందుకంటే దీనిని నిర్లక్ష్యంగా పరిగణిస్తాయి.

అన్నింటికీ వర్తించేలా..

ఏదైనా సమస్య వచ్చి బీమా క్లెయిమ్​ చేసుకోవాల్సి వస్తే.. ఎలాంటి బీమా కంపెనీతో వివాదాలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. కార్​ నుంచి కారులో ఉంటే ఉపకరణాల వరకు వర్తించే విధంగా యాడ్​ఆన్​లు తీసుకోవాలి. నీట మునిగినా బీమా వర్తించే విధంగా ఇంజిన్ ప్రొటెక్షన్ తీసుకోవాలి. ఇందుకు ప్రీమియం నామమాత్రంగానే ఉంటుంది. బీమా తీసుకునే సమయంలోనే వీటిని తీసుకోవాలి. లేదా బీమా రెన్యువల్​ వరకు వేచి ఉండాల్సి ఉంటుంది.

ఇదీ చూడండి:ఫేస్​బుక్​ సీఈఓ మార్క్​కు రూ.54 వేల కోట్ల నష్టం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.