ETV Bharat / business

ఇన్​స్టా​ సీఈఓ చెప్పిన హిడెన్​ ఫీచర్లు.. - ఇన్​స్టాగ్రామ్ అప్లికేషన్లు

ఇన్‌స్టాగ్రామ్ సీఈఓ ఆడమ్ మొస్సేరి వినియోగదారులకు ఉపయోగపడే వివిధ ఫీచర్స్​ గురించి నెటిజన్లకు వివరిస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈ వారం మరిన్ని ఫీచర్‌ల వివరాలను ఆయన పంచుకున్నారు. రోజూ ఇన్​స్టాగ్రామ్​ వాడుతున్నా మనకు తెలియని ఆ ఫీచర్స్​ ఏంటో చూసేద్దామా?

Instagram features you may not know
ఇన్​స్టాగ్రామ్ హిడెన్​ ఫీచర్స్ తెలుసా?
author img

By

Published : Apr 11, 2021, 4:38 PM IST

Updated : Apr 11, 2021, 4:44 PM IST

ఇన్​స్టాగ్రామ్​.. డిజిటల్​ యుగంలో ఇది మనిషి జీవితంలో ఓ భాగమైపోయింది. ఇన్​స్టాగ్రామ్​ ఉపయోగించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వాడేందుకు సులభంగా ఉండటం ఇందుకు ఓ కారణం. అయితే ఇన్​స్టాగ్రామ్​లో కొన్ని హిడెన్​ ఫీచర్స్​ ఉన్నాయి. యాప్​ను రోజూ ఉపయోగిస్తున్నప్పటికీ.. వాటి గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. ఆ ఫీచర్స్​ను స్వయంగా ఇన్​స్టాగ్రామ్​ సీఈఓ ఆడమ్​ మొస్సేరి వెల్లడించారు. మరి అవేంటో చూసేద్దామా..

ఫీచర్స్​ ఇలా..

ఇన్​స్టాగ్రామ్​లో మనం ఏదైనా సెర్చ్​ చేయాలనుకుంటే.. ఎక్స్​ప్లోర్​ ట్యాబ్​ని కొంచెంసేపు క్లిక్​ చేసినట్లయితే.. అది నేరుగా సెర్చ్​ ఆప్షన్​కి తీసుకెళుతుంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు ఖాతాలను ఉపయోగించే వారు ఉంటారు. వారి కోసం కొత్తగా ఓ ఫీచర్​ను తీసుకొచ్చింది సంస్థ. కింది భాగంలో ఎడమవైపు ఉండే ప్రొఫైల్​ ఐకాన్​ను డబుల్​ క్లిక్​ చేస్తే.. ఖాతాలు స్విచ్​ అవుతాయి.

ఇన్​స్టాగ్రామ్​ ఫీడ్‌లో స్క్రోల్ చేస్తూ చేస్తూ తిరిగి పైకి వెళ్లాలనుకుంటే.. హోమ్ ఐకాన్‌పై నొక్కితే సరిపోతుంది. వివిధ స్టోరీలను తెరవకుండానే వాటిని ఎలా చూడొచ్చు అన్నదానికి ఎక్స్‌ప్లోర్ ట్యాబ్‌లోని థంబ్​నెయిల్​ని నొక్కి పట్టుకుంటే సరిపోతుందని మొస్సేరి పేర్కొన్నారు. అయితే ఈ రెండు ఫీచర్లు వినియోగదారులకు సుపరిచితమైనవే.

ఇవీ చదవండి: క్రోమ్​ వాడుతున్నారా? అయితే జాగ్రత్త!

48 మంది బిలియనీర్లతో టాప్​-10లోకి ముంబయి

Last Updated : Apr 11, 2021, 4:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.