ఇన్ఫినిక్స్ నోట్ సిరీస్‌లో కొత్త మోడల్‌ను భారత మార్కెట్లోకి బుధవారం ప్రవేశ పెట్టింది సంస్థ. మధ్యశ్రేణి కస్టమర్ల కోసం నోట్ 5 ఫోన్ స్థానంలో నూతన మొబైల్‌ను తీసుకొచ్చింది. సెప్టెంబర్ 22 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోళ్లకు అందుబాటులో ఉంటుందని సంస్థ ప్రతినిధులు చెప్పారు. తక్కువ ధరకు ఆకర్షణీయ ఫీచర్లు ఉన్న ఈ ఫోన్ వివరాలు ఇలా ఉన్నాయి.
ధర ఎంతంటే..
4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ తో లాంచ్ చేసిన ఈ మోడల్ ధర రూ .11,499. నలుపు, ఆకుపచ్చ, బొలివియా బ్లూ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది.
ఫీచర్లు..
- 6.95 అంగుళాల హెచ్డీ డిస్ప్లే
- మీడియా టెక్ హెలియో జీ70 చిప్ సెట్ తో పనిచేస్తుంది.
- ప్రత్యేకమైన మెమొరీ కార్డ్ స్లాట్‌ను కలిగి ఉంది.
- 64 జీబీ స్టోరేజీ ఉన్న స్టోరేజీని 256జీబీ వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు.
- సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది.
- ఆండ్రాయిడ్ 10 ఆధారంగా పనిచేస్తుంది.
- వెనుక భాగంలో ప్రధాన కెమెరా 48ఎంపీ, 2ఎంపీ డెప్త్ సెన్సార్, 2 ఎంపీ మాక్రో లెన్స్ ఉంటాయి. నాలుగో సెన్సార్ ఇన్ఫినిక్స్ క్వాడ్-ఎల్ఈడీ ఫ్లాష్ తో వచ్చే ఏ1 లెన్స్ దీనికి అమర్చారు.
- 16 ఎంపీ సెల్ఫీ కెమెరా.
- 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ. 2 గంటల్లో ఫోన్ పుల్ ఛార్జ్ అవుతుంది.