ETV Bharat / business

భారత్​ మైలు రాయి.. 100 గిగావాట్లకు పునరుత్పాదక శక్తి

author img

By

Published : Aug 13, 2021, 5:53 AM IST

దేశంలో పునరుత్పాదక శక్తి​ ఉత్పత్తి సామర్థ్యం 100 గిగావాట్లు దాటినట్లు కేంద్రం తెలిపింది. ప్రస్తుతం 50 గిగావాట్ల సామర్థ్యం చేరే దిశగా కేంద్రాలు నిర్మిస్తున్నామని.. త్వరలో మరో 27 గిగావాట్లకు కేంద్రాలు నిర్మించనున్నామని ప్రభుత్వం తెలిపింది.

renewable energy capacity
భారత్​కు మైలు రాయి.. పెరిగిన విద్యుత్​ కెపాసిటీ!

భారత్​లో జలవిద్యుత్​ మినహా.. పునరుత్పాదక శక్తి ఉత్పత్తి​ సామర్థ్యం గురువారానికి 100 గిగావాట్లు దాటినట్లు కేంద్రం వెల్లడించింది. దీంతో ప్రపంచంలో అత్యధిక పునరుత్పాదక శక్తి ఉత్పత్తి​ సామర్థ్యం గల నాలుగో దేశంగా భారత్​ నిలిచిందని పేర్కొంది. ఇది ఓ మైలురాయిగా నిలవనుందని తెలిపింది. సోలార్​ విద్యుత్​ ఉత్పత్తిలో 5వ స్థానం, పవన విద్యుత్​ ఉత్పత్తిలో 4వ స్థానంలో కొనసాగుతున్నామని తెలిపింది.

ప్రస్తుతం 50 గిగావాట్ల సామర్థ్యం చేరే దిశగా కేంద్రాలు నిర్మిస్తున్నామని.. మరో 27 గిగావాట్లకు కేంద్రాలు నిర్మించనున్నామని ప్రభుత్వం తెలిపింది.

2022 నాటికి దేశంలో ఈ పునరుత్పాదక విద్యుత్​ సామర్థ్యం 175 గిగావాట్లకు చేరుకోవాలన్నది కేంద్రం లక్ష్యం. ఈ లక్ష్యం 2030 నాటికి 450 గిగావాట్లుగా ఉంది.

ఇదీ చదవండి : 'కొవిడ్ సంక్షోభంలోనూ సాహసోపేత నిర్ణయాలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.