ప్రముఖ చమురు మార్కెటింగ్ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కీలక ప్రకటన చేసింది. త్వరలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం దేశవ్యాప్తంగా 10వేల ఛార్జింగ్ స్టేషన్స్ (Indian Oil EV Charging Station) ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. మరో మూడేళ్లలో ఇది పూర్తి కానున్నట్లు (Indian Oil EV Charging Station) ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఛైర్మన్ ఎస్ఎం వైద్య పేర్కొన్నారు.
-
We will be setting up 10,000 EV charging stations in the next three years: SM Vaidya, Chairman, Indian Oil Corporation pic.twitter.com/XJNr5jcDMN
— ANI (@ANI) November 3, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">We will be setting up 10,000 EV charging stations in the next three years: SM Vaidya, Chairman, Indian Oil Corporation pic.twitter.com/XJNr5jcDMN
— ANI (@ANI) November 3, 2021We will be setting up 10,000 EV charging stations in the next three years: SM Vaidya, Chairman, Indian Oil Corporation pic.twitter.com/XJNr5jcDMN
— ANI (@ANI) November 3, 2021
"మరో 12 నెలల్లో 2000 ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్‌ను (Indian Oil EV Charging Station) ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత రెండేళ్లలో మరో 8వేల ఛార్జింగ్ స్టేషన్స్‌ను స్థాపించడం ద్వారా మూడేళ్లలో 10వేల ఛార్జింగ్ స్టేషన్స్‌ను ఏర్పాటు చేయాలనే మా లక్ష్యాన్ని చేరుకుంటాం."
-ఎస్ఎం వైద్య, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఛైర్మన్
విద్యుత్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఇండియన్ ఆయిల్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇటీవల రిలయన్స్, భారత్ పెట్రోలియం కూడా ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటుపై ప్రకటన విడుదల చేశాయి. రెండు సంస్థలూ సంయుక్తంగా సంబంధిత ఫ్యూయెల్ పంప్‌లలో ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించాయి.
ఇదీ చూడండి : 5జీ ట్రయల్స్‌లో వొడాఫోన్ ఐడియా నయా రికార్డు!