ETV Bharat / business

బుకింగ్‌ చేసుకున్న రోజే గ్యాస్‌ డెలివరీ! - బుకింగ్​ చేసుకున్న రోజే గ్యాస్​ డెలివరీ

ఎల్​పీజీ గ్యాస్ వినియోగదారులకు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) త్వరలోనే శుభవార్త అందించనున్నట్లు సమాచారం. బుకింగ్​ చేసుకున్న రోజే గ్యాస్​ డెలివరీ అందించే యోచనలో సంస్థ ఉన్నట్లు ఐఓసీ అధికారి తెలిపారు.

indian oil corporation is planning to delivery LPG gas cylinder to its customers on booking day
బుకింగ్‌ చేసుకున్న రోజే గ్యాస్‌ డెలివరీ - ఐఓసీ సన్నాహాలు
author img

By

Published : Jan 13, 2021, 7:11 AM IST

వినియోగదారులు బుకింగ్‌ చేసుకున్న రోజే వంటగ్యాస్‌ డెలివరీ చేసే విధంగా తత్కాల్‌ సేవ ప్రారంభించడానికి ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) సన్నాహాలు చేస్తుంది. ‘ప్రతి రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతంలో ఒక నగరం లేదా జిల్లాను తత్కాల్‌ ఎల్‌పీజీ సేవల ప్రారంభానికి గుర్తించాల్సి ఉంటుంది. ఈ పథకం కింద బుక్‌ చేసుకున్న 30-45 నిమిషాల్లోనే వినియోగదారుడికి గ్యాస్‌ డెలివరీ అందించనున్నాం’ అని ఐఓసీ అధికారి ఒకరు పేర్కొన్నారు. కేంద్రం నినాదమైన ‘సులభతర జీవనం’ మెరుగుపరచడంలో భాగంగా అందించనున్న ఈ సేవలను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. ఫిబ్రవరి 1 కల్లా తత్కాల్‌ వంటగ్యాస్‌ సేవలను ప్రారంభించాలని చూస్తున్నట్లు సదరు అధికారి తెలిపారు.

ఇండేన్‌ బ్రాండ్‌ ద్వారా ఐఓసీ వంటగ్యాస్‌ సిలిండర్‌లను పంపిణీ చేస్తోంది. దేశవ్యాప్తంగా 14 కోట్ల మంది ఇండేన్‌ వినియోగదారులు ఉన్నారు.

ఇదీ చదవండి : 'సిమెంట్ ధరలపై బిల్డర్ల ఆరోపణలు అవాస్తవం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.