ETV Bharat / business

'బలమైన బ్యాంకుగా ఎదుగుతున్నాం' - ఇండియన్ బ్యాంకు త్రైమాసిక ఫలితాలు

ఈ ఆర్థిక సంవత్సరంలో ఇండియన్ బ్యాంకు వ్యాపారంలో 9 శాతం వృద్ధి నమోదవుతుందని ఆ బ్యాంకు ఎండీ, సీఈఓ పద్మజ చుండూరు అంచనా వేశారు. ప్రస్తుతం రిటైల్‌, ఎంఎస్‌ఎంఈ విభాగాలపై ప్రధానంగా దృష్టిసారించినట్లు తెలిపారు. అలహాబాద్‌ బ్యాంకు విలీన ప్రక్రియ సాఫీగా కొనసాగుతోందని స్పష్టం చేశారు.

padmaja chunduru
పద్మజ చుండూరు
author img

By

Published : Dec 19, 2020, 5:57 AM IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇండియన్‌ బ్యాంకు వ్యాపారంలో 9 శాతం వృద్ధి లభిస్తుందని అంచనా వేస్తున్నట్లు ఇండియన్‌ బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ), ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) పద్మజ చుండూరు తెలిపారు. కొవిడ్‌-19 ప్రభావం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని, టీకా అందుబాటులోకి వస్తే ఆర్థిక కార్యకలాపాలు ఇంకా వేగం పుంజుకుని, బ్యాంకింగ్‌ రంగం మెరుగైన వృద్ధి నమోదు చేయగలదని విశ్లేషించారు. ఇండియన్‌ బ్యాంకు ప్రధానంగా రిటైల్‌, ఎంఎస్‌ఎంఈ రుణ విభాగాలపై దృష్టి కేంద్రీకరించినట్లు వెల్లడించారు. అలహాబాద్‌ బ్యాంకు విలీన ప్రక్రియ వేగంగా అమలవుతోందని, ఐటీ సిస్టమ్స్‌ విలీనం నెల రోజుల్లో పూర్తవుతుందని తెలిపారు. బ్యాంకు పనితీరు, భవిష్యత్తు అంచనాలపై ఆమె ‘ఈనాడు’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

విశేషాలు:

? ఇండియన్‌ బ్యాంకు పనితీరు ఎలా ఉంది

నిర్దేశించుకున్న ప్రణాళికలకు అనుగుణంగా ముందడుగు వేస్తున్నాం. అలహాబాద్‌ బ్యాంక్‌ విలీనం తరవాతా నికర లాభం, మూలధన నిష్పత్తి, స్థూల-నికర నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ), పొదుపు-కరెంటు (కాసా) ఖాతాల నిధులు, ప్రొవిజన్‌ కవరేజ్‌ రేషియో (పీసీఆర్‌)... తదితర అన్ని ప్రమాణాలు బాగున్నాయి. ఆదాయాలు పెంచుకుంటూనే వ్యయాలు తగ్గించుకోవడం, మొండి బాకీలు వసూలు చేయడంపై దృష్టి సారించాం.

? సెప్టెంబరు త్రైమాసిక ఫలితాలపై మీ విశ్లేషణ ఏమిటి

అన్ని విభాగాల్లో మెరుగైన పనితీరు నమోదు చేశాం. నిర్వహణ లాభాలు 40 శాతం పెరిగాయి. నికరలాభం రూ.412 కోట్లు నమోదైంది. కాసా 41 శాతం, నికర వడ్డీ మార్జిన్‌ 3.06 శాతంగా ఉన్నాయి. స్థూల ఎన్‌పీఏ 9.89 శాతం, నికర ఎన్‌పీఏ 2.96 శాతానికి పరిమితం అయ్యాయి. పీసీఆర్‌ 84.39 శాతానికి పెరిగింది. మూలధన నిష్పత్తి 13.64 శాతం ఉంది. నికర ఎన్‌పీఏలు ఇకపైనా 3 శాతం కంటే తక్కువగా ఉంటాయనే నమ్మకం ఉంది.

? 2020-21 ఆర్థిక సంవత్సరానికి మీ అంచనాలు ఎలా ఉన్నాయి

మొత్తం వ్యాపారం 9 శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో రుణాల జారీలో పెద్దగా వృద్ధి లేదు. కానీ ద్వితీయార్థం కొంత మెరుగ్గా ఉంటుంది. మొండి బాకీలు తగ్గించుకోడానికి, వసూళ్లు పెంచుకోడానికి కృషి చేస్తున్నాం. వడ్డీ-ఇతర ఆదాయాలు పెరుగుతున్నాయి. అందువల్ల లాభాలు కొనసాగుతాయని అంచనా.

? ఏ రుణ విభాగాలపై అధికంగా దృష్టి సారిస్తున్నారు

రిటైల్‌, ఎంఎస్‌ఎంఈ రుణ విభాగాల్లో అధికంగా వృద్ధి కనిపిస్తోంది. కొత్త ఖాతాదార్లతో పాటు మంచి రేటింగ్‌ ఉన్న పెద్ద, మధ్యతరహా కార్పొరేట్‌ సంస్థల రుణ అభ్యర్థనలకు సానుకూలంగా స్పందిస్తున్నాం. విలీనం వల్ల మా ఆస్తి-అప్పుల పట్టీ పెద్దదైంది. దానివల్ల పెద్ద రుణాలు ఇవ్వగలిగే సత్తా లభించింది.

? అలహాబాద్‌ బ్యాంక్‌ విలీన ప్రక్రియ ఎలా సాగుతోంది

ఇండియన్‌ బ్యాంకుతో అలహాబాద్‌ బ్యాంకు విలీనం వేగంగా సాగుతోంది. ఈ ప్రక్రియలో ఖాతాదార్లకు ఇబ్బందులు ఎదురుకాకుండా, సిబ్బంది- ఐటీ వ్యవస్థల విలీనం సాఫీగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. ఐటీ వ్యవస్థల విలీనం ఒక నెలలో పూర్తికావచ్చు. 153 శాఖలను విలీనం చేశాం. 44 పరిపాలనా కార్యాలయాలను హేతుబద్ధీకరించాం. మిడ్‌ కార్పొరేట్‌, క్రెడిట్‌ మోనిటరింగ్‌ - రికవరీ... తదితర విభాగాలకు ప్రాధాన్యం ఇస్తూ కొత్త పరిపాలనా విధానాన్ని తీసుకువచ్చాం. అన్ని జోన్లలో రిటైల్‌/ ఎంఎస్‌ఎంఈ రుణ దరఖాస్తులను త్వరితంగా పరిశీలించేందుకు కేంద్రీకృత ప్రాసెసింగ్‌ కేంద్రాలు నెలకొల్పాం. ‘ఇండ్‌ ఒయాసిస్‌’ పేరుతో మొబైల్‌ యాప్‌ ఆవిష్కరించాం. ఎంఎస్‌ఎంఈ విభాగానికి మేలు చేసేందుకు ప్రాంతీయ భాషల్లో సదస్సులు నిర్వహిస్తున్నాం. ఐఐటీ- మద్రాస్‌ ఇంక్యుబేషన్‌ కేంద్రంతో కలిసి ‘ఇండ్‌స్ప్రింగ్‌బోర్డ్‌’ పేరుతో అంకుర సంస్థలకు అండగా నిలిచే కార్యక్రమాన్ని చేపట్టాం. సమీప భవిష్యత్తులో ఇండియన్‌ బ్యాంకు మరింత బలోపేతం కావడానికి ఈ చర్యలు వీలుకల్పిస్తాయని విశ్వసిస్తున్నాం.

? అలహాబాద్‌ బ్యాంక్‌ ఖాతాల్లోని నష్టాలను ఇండియన్‌ బ్యాంకు షేరు ప్రీమియం ఖాతాలోని సొమ్ముతో రద్దు చేశారు. దీనికి ఎటువంటి ప్రాధాన్యం ఉంది

రెండు బ్యాంకుల విలీనం నాటికి పేరుకుపోయిన నష్టాలు రూ.18,975 కోట్ల మేరకు ఉన్నాయి. అదే సమయంలో షేరు ప్రీమియం ఖాతాలో రూ.19,833 కోట్ల నిధులున్నాయి. అందువల్ల నష్టాలు సర్దుబాటు చేయడానికి వీలుకలిగింది. దీనివల్ల బ్యాంకు ఆర్థిక స్థితి ఏమిటనేది స్పష్టంగా అర్థమైంది. ఈ సర్దుబాటు వల్ల ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం ఇండియన్‌ బ్యాంకు వాటాదార్లకు డివిడెండ్‌ చెల్లించే అవకాశం ఏర్పడుతుంది. బ్యాంకు రేటింగ్‌ కూడా పెరుగుతుంది.

? కొవిడ్‌-19 నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న నేపథ్యంలో బ్యాంకింగ్‌ రంగానికి ఎటువంటి అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు

సానుకూల రుతుపవనాల వల్ల వ్యవసాయ దిగుబడులు పెరిగే అవకాశం కనిపిస్తోంది. విద్యుత్తు వినియోగం, ఇ-వే బిల్లులు అధికంగా నమోదవుతున్నాయి. రైళ్ల ద్వారా సరకు రవాణా పెరుగుతోంది. ఇవన్నీ గమనిస్తే ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటున్నట్లు అనుకోవచ్చు. ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వ మద్దతుతో బ్యాంకులు దేశ ఆర్థిక వ్యవస్థకు అండగా నిలిచాయి. నగదు లభ్యత పెంచడం, వడ్డీరేట్లు తగ్గించటం.. వంటి కీలక చర్యలు తీసుకున్నాయి. ప్రస్తుతం రిటైల్‌ డిమాండ్‌ బాగానే ఉన్నా, కార్పొరేట్‌ పెట్టుబడులు పెరగడం లేదు. కొవిడ్‌-19 టీకా అందుబాటులోకి వచ్చాక, బ్యాంకింగ్‌ రంగానికి మెరుగైన వృద్ధి అవకాశాలున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.