ETV Bharat / business

కరోనా ఎఫెక్ట్‌.. జీడీపీ అంచనాలు కట్‌ - భారత్​ జీడీపీ

దేశంలో కరోనా విలయం సృష్టిస్తున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి అంచనాలను ఐరాస సహా పలు సంస్థలు తగ్గించాయి. ఈ ఏడాదిలో భారత్.. 7.5శాతం మేర వృద్ధి నమోదు చేస్తుందని ఐరాస అంచనా వేయగా.. జపనీస్‌ బ్రోకరేజీ సంస్థ నొమురా ప్రస్తుత ఏడాదికి భారత్​ ఆర్థిక వృద్ధిని 10.8 శాతంగా అంచనా వేసింది. మూడీస్​ కూడా తన అంచనాలను సవరించింది.

GDP
జీడీపీ
author img

By

Published : May 12, 2021, 5:36 AM IST

భారత్‌.. 2022లో 10.1శాతం మేర వృద్ధిరేటు నమోదు చేస్తుందని ఐక్యరాజ్యసమితి అంచా వేసింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా పేర్కొంది. అయితే 2021లో మాత్రం కరోనా మహమ్మారి విలయం కారమంగా పరిస్థితి చాలా దుర్భరంగా ఉంటుందని తెలిపింది. ఈ ఏడాదిలో భారత్.. 7.5శాతం మేర వృద్ధి నమోదు చేస్తుందని ఐరాస అంచనా వేసింది.

టీకా కొరతే వృద్ధి క్షీణతకు కారణం

జనవరిలో విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2020లో భారత్ 9.6 శాతం మేర వృద్ధిరేటు నమోదు చేసిందని.. 2021లో 7.3 శాతం, 2022లో 5.9 శాతంగా ఉంటుందని తెలిపింది. అయితే ఇప్పుడు మహమ్మారి సృష్టించిన విలయానికి దేశంలో పరిస్థితులు మారిపోగా.. ఆర్థిక వ్యవస్థలో వృద్ధిరేటు దారుణంగా క్షీణించే అవకాశం ఉందని అంచనా వేసింది. ప్రజలకు వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడమే దీనికి కారణంగా పేర్కొంది. భారత్‌లో ప్రతి 100 మందిలో 10 మందికే టీకా అందుబాటులో ఉంటే అమెరికాలో 68.2 మందికి టీకా అందుబాటులో ఉన్నట్లు తెలిపింది.

లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌

కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు లాక్‌డౌన్‌ విధిస్తున్న నేపథ్యంలో దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు అంచనాలను జపనీస్‌ బ్రోకరేజీ సంస్థ నొమురా తగ్గించింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి వృద్ధిరేటు 10.8 శాతంగా ఉంటుందని పేర్కొంది. గతంలో జీడీపీ 12.6 శాతంగా నమోదు అవుతుందని ఇదే సంస్థ అంచనా కట్టింది. సెకండ్‌ వేవ్‌ దృష్ట్యా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధిస్తుండడంతో కార్యకలాపాలు తగ్గడమే ఇందుకు కారణమని నొమురా పేర్కొంది.

ఇప్పటికే ఆర్‌బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధిరేటు అంచనాలను 10.5 శాతంగా అంచనా వేసింది. ఈ సారి వృద్ధిరేటు 8.2 శాతంగా నమోదయ్యే అవకాశం కూడా ఉందని కొందరు నిపుణులు చెబుతున్నారు.

మూడీస్‌ కూడా..

మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ కూడా భారత జీడీపీ అంచనాలను సవరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధిరేటు 9.3 శాతంగా లెక్కగట్టింది. గతంలో 13.7 శాతం ఉంటుందని అంచనా వేసింది. సెకండ్‌ వేవ్‌ కారణంగా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఉన్నప్పటికీ రెండో అర్ధభాగంలో పుంజుకుంటుందని అభిప్రాయపడింది.

దేశీయ ఏజెన్సీ నోట అదే పాట

దేశీయ రేటింగ్​ ఏజెన్సీ కేర్​ రేటింగ్స్​​ కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి అంచనాను సవరించింది. గతంలో వృద్ధి రేటు 10.2 శాతం నమోదవుతుందని అంచనా వేయగా.. దానిని 9.2 శాతానికి తగ్గించింది.

ఇదీ చూడండి: వాట్సాప్‌ నిబంధనలు అంగీకరించకుంటే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.