బ్రిటన్‌లో ఎక్కువగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఉన్న దేశాల్లో భారత్ రెండో స్థానానికి ఎగబాకింది. 2019లో మన దేశం బ్రిటన్‌లో 120 ప్రాజెక్ట్‌లలో పెట్టుబడి పెట్టి.. 5,429 కొత్త ఉద్యోగాలు సృష్టించింది. బ్రిటన్ ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక గణాంకాలో ఈ విషయం వెల్లడైంది.
2018-19తో పోలిస్తే 2019-20లో బ్రిటన్‌లో భారత్ పెట్టుబడులు 4 శాతం పెరిగినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ (డీఐటీ) తెలిపింది.
బ్రిటన్‌లో ఎఫ్‌డీఐలు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో అమెరికా అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 462 ప్రాజెక్ట్‌లలో పెట్టుబడి ద్వారా 20,131 ఉద్యోగాలు కల్పించింది అమెరికా. ఈ జాబితాలో భారత్ తర్వాత జర్మనీ, ఫ్రాన్స్, చైనా, హాంకాంగ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు ఉన్నాయి.
ఇదీ చూడండి:'గత వందేళ్లలో కరోనానే అతిపెద్ద సంక్షోభం'