ETV Bharat / business

చమురు కొనుగోళ్లలో సౌదీని పక్కన పెడదామా? - భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌(బీపీసీఎల్‌)

చమురు ఉత్పత్తిదారులు కుమ్కక్కై ధరలు, కాంట్రాక్టు షరతులను శాసించే పరిస్థితులను మార్చాలని భారత్‌ గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఎప్పటి నుంచో మనం.. సౌదీ అరేబియా, ఇతర ఒపెక్‌ దేశాల నుంచే ప్రధానంగా చమురు కొంటున్నాం. అయితే వాటి షరతులు ఎపుడూ కొనుగోలుదారుపై భారం వేస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా నుంచి కొనుగోలు చేసే చమురు విషయంలో కాంట్రాక్టులను సమీక్షించాలని ప్రభుత్వ రంగ చమురుశుద్ధి కంపెనీలను కేంద్రం కోరినట్లు సమాచారం.

oil imports of india
చమురు కొనుగోళ్లలో సౌదీని పక్కన పెడదామా?
author img

By

Published : Apr 3, 2021, 6:38 AM IST

సౌదీ అరేబియాకు భారత్‌కు మధ్య ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌ కఠిన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. చమురు ఉత్పత్తిదారులు కుమ్కక్కై ధరలు, కాంట్రాక్టు షరతులను శాసించే పరిస్థితులను మార్చాలని భారత్‌ గట్టిగా నిర్ణయించుకున్నట్లుంది. ఈ నేపథ్యంలోనే సౌదీ అరేబియా నుంచి కొనుగోలు చేసే చమురు విషయంలో కాంట్రాక్టులను సమీక్షించాలని ప్రభుత్వ రంగ చమురుశుద్ధి కంపెనీలను కేంద్రం కోరినట్లు సమాచారం. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐఓసీ), భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌(బీపీసీఎల్‌), హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌(హెచ్‌పీసీఎల్‌)లు మధ్యప్రాచ్యం వెలుపల నుంచి చమురు సరఫరా పొందే దిశగా ప్రయత్నించాలని సూచించింది. తద్వారా ధర విషయంలో కానీ, సానుకూల షరతుల విషయంలో కానీ బేరమాడే శక్తిని పొందొచ్చని భావిస్తోంది.

మన మాట పెడచెవిన పెట్టినందుకే..

భారత్‌ తన ముడి చమురు అవసరాల్లో 85 శాతం వరకు దిగుమతి చేసుకుంటోంది. దీంతో అంతర్జాతీయ సరఫరా, ధరల విషయంలో ఇబ్బందులు పడుతోంది. ఫిబ్రవరిలో చమురు ధరలు పెరగడం మొదలైనపుడు.. ఉత్పత్తి నియంత్రణలను సడలించాలని సౌదీ అరేబియాను కోరింది. అయితే అది మన మాట వినలేదు. దీంతో భారత ప్రభుత్వం చమురు కొనుగోలు చేసే దేశాల విషయంలో ప్రత్యామ్నాయాల వైపు చూడాలని నిర్ణయించుకుంది.

oil imports of india
ఫిబ్రవరిలో భారత చమురు దిగుమతులు

కొనుగోలుదారుపై షరతులా?

ఎప్పటి నుంచో మన సౌదీ అరేబియా, ఇతర ఒపెక్‌ దేశాల నుంచే ప్రధానంగా చమురు కొంటున్నాం. అయితే వాటి షరతులు ఎపుడూ కొనుగోలుదారుపై భారం వేస్తూనే ఉన్నాయని ఈ చర్చలతో నేరుగా సంబంధమున్న ఒక అధికారి వివరిస్తున్నారు. ఉదాహరణకు భారత కంపెనీలు తమ కొనుగోళ్లలో మూడింట రెండొంతుల వరకు స్థిర వార్షిక కాంట్రాక్టులు లేదా టర్మ్‌ పద్ధతిలో తీసుకుంటాయి. ఈ కాంట్రాక్టుల వల్ల పరిమాణం విషయంలో హామీ ఉంటుంది. అయితే ధర విషయంలో మాత్రం సరఫరాదారుకే సానుకూలంగా షరతులున్నాయని ఆ అధికారి చెప్పుకొచ్చారు. ఏదైనా మార్కెట్లో లోడింగ్‌ జరిగే రోజున ఉండే ధర ఉంటుంది. అయితే సౌదీ ఇతర ఒపెక్‌ దేశాలు మాత్రం తమ అధికారిక విక్రయ ధర వద్దే అమ్ముతాయి. దీంతో అంతర్జాతీయంగా చమురు ధర తగ్గినా మనకు ప్రయోజనం అంటూ లేకుండా పోతోంది. వినియోగదారుడిగా ఉండి ఒపెక్‌ నిర్ణయాల వల్ల ఎక్కువ ధరను మనం ఎందుకు చెల్లించాలి? అని ఇపుడు భారత్‌ ఇపుడు ప్రశ్నించుకుంటోందని ఆ అధికారి తెలిపారు.

రిఫైనరీలు ఏం చేయబోతున్నాయంటే..

ఇటువంటి సమయంలో భారత రిఫైనరీలు టర్మ్‌ కాంట్రాక్టుల ద్వారా చేసే కొనుగోళ్లను తగ్గించుకోవడంపై దృష్టి సారిస్తున్నారు. స్పాట్‌ లేదా కరెంట్‌ మార్కెట్‌ నుంచి ఎక్కువ కొనుగోలు చేయాలని భావిస్తున్నాయి. తద్వారా చమురు ధరలు తగ్గినపుడు ఆ ప్రయోజనాలను అందిపుచ్చుకుని స్పాట్‌ మార్కెట్లో కొనుగోళ్లు చేపట్టవచ్చు. దశాబ్దం కిందటితో చూస్తే భారత రిఫైనరీ కంపెనీ స్పాట్‌ కొనుగోళ్లను 20 శాతం నుంచి 30-35 శాతం వరకు పెంచాయి కూడా. ప్రస్తుతం ప్రైవేటు రిఫైనరీ (రిలయన్స్‌, నయారా ఎనర్జీ)లతో కలిసి సంయుక్త వ్యూహాలను రచించుకుని కొనుగోలు విషయంలో సహకారం అందించుకుంటే.. ధర, సరఫరాల విషయంలో సానుకూలతలు వస్తాయని విశ్లేషకులు అంటున్నారు. మధ్యప్రాచ్యం నుంచి 60 శాతం వరకు చమురు కొనుగోళ్లు చేస్తున్న భారత్‌ ఇపుడు అమెరికా, గయానా వంటి ఇతర దేశాలవైపు దృష్టి సారిస్తోంది. తద్వారా రేట్లపై పట్టు సాధించాలని భావిస్తోంది.

'ఒపెక్‌ దేశాలూ.. ఉత్పత్తి కోతలొద్దు'

అధిక ముడి చమురు ధరల కారణంగా పలు వినియోగదారు దేశాలు ఇబ్బంది పడుతున్నాయని.. ముడి చమురు ఉత్పత్తి కోతలను సడలించాలని శుక్రవారం భారత్‌ గట్టిగా కోరింది. 'పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ(ఒపెక్‌), ఒపెక్‌ ప్లస్‌(రష్యా, ఇతర దేశాలు కలిపి)కు మా విన్నపం ఏమిటంటే.. ఈ ఏడాది మొదటి నుంచి ముడి చమురు ఉత్పత్తి కోతలను సడలించండి. గతేడాదిలో ప్రకటించిన కోతల వల్ల భారత్‌ పాటు పలు దేశాలు ధరలతో ఇబ్బంది పడుతున్నాయి. ముడి చమురు సరఫరా అనేది మార్కెట్‌ ఆధారంగా ఉండాలి కానీ కృత్రిమంగా ఉండరాద'ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి పేర్కొన్నారు. గత వారం ఒపెక్‌, ఒపెక్‌ ప్లస్‌లు ఉత్పత్తి కోతలను కాస్త సడలించారు. అయితే ఇది అంతక్రితం ప్రకటించిన ప్రణాళిక కంటే చాలా తక్కువగా ఉందని గుర్తు చేశారు.

ఇదీ చూడండి:భారత్‌ నుంచి నిష్క్రమించేది లేదు: ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.