ETV Bharat / business

'హెచ్​-1బీ' వీసా తిరస్కరణలో భారతీయ టెక్​ కంపెనీలే టాప్​! - హెచ్1-బి

విదేశీ ఉద్యోగులకు అందించే హెచ్​-1బీ వీసాల జారీలో అమెరికా కఠినంగా వ్యవహరిస్తోంది. 2019లో ప్రతి ఐదు దరఖాస్తుల్లో ఒకటి తిరస్కరణకు గురైనట్లు ఓ నివేదిక వెల్లడించటం ఇందుకు నిదర్శనంగా తెలుస్తోంది. అయితే.. ఇందులో అత్యధిక శాతం భారతీయ ఐటీ కంపెనీలకు చెందిన దరఖాస్తులే ఉండటం గమనార్హం.

US denied one in five H1B petitions with denial rate higher for Indian IT companies
'హెచ్​-1బీ' వీసా తిరస్కరణలో భారతీయ టెక్​ కంపెనీలే టాప్​!
author img

By

Published : Mar 5, 2020, 5:41 PM IST

విదేశీ ఉద్యోగులకు అమెరికా అందించే హెచ్​-1బీ వీసాల జారీలో.. 2019 ఏడాదిలో ప్రతి ఐదు దరఖాస్తుల్లో ఒకటి తిరస్కరణకు గురైంది. వీసాల తిరస్కరణలో భారతీయ ఐటీ కంపెనీలైన టీసీఎస్​, ఇన్ఫోసిస్​ వంటి సంస్థలు ముందు వరుసలో ఉన్నాయి.

2019 ఏడాదికి గాను హెచ్​-1బీ వీసాల జారీ ప్రక్రియకు సంబంధించిన నివేదికను విడుదల చేసింది నేషనల్​ ఫౌండేషన్​ ఫర్​ అమెరికన్​ పాలసీ.

స్వల్పంగా తగ్గిన తిరస్కరణ రేటు

భారతీయ ఐటీ సంస్థల వీసాల తిరస్కరణల రేటు 2019లో అధికంగా ఉంది. అయితే.. మొత్తంగా ఈ రేటు 2018తో పోల్చితే స్వల్పంగా తగ్గింది. 2018లో 24 శాతంగా ఉండగా అది 2019లో 21 శాతంగా నమోదైంది.

భారత సంస్థలకే అధికం..

వీసాల నిరాకరణలో అమెరికా సంస్థలైన అమెజాన్​, గూగుల్​ వంటి వాటితో పోలిస్తే.. తిరస్కరణకు గురైన వీసాల్లో భారతీయ ఐటీ సంస్థలైన టీసీఎస్​, ఇన్ఫోసిస్,​ విప్రో, టెక్​ మహీంద్రాలు ముందున్నాయని నివేదిక వెల్లడించింది. 2019లో టీసీఎస్​కు 31 శాతం, ఇన్ఫోసిస్​కు 35 శాతం, విప్రోకు 47 శాతం, టెక్​ మహీంద్రాకు 37 శాతం మేర వీసాలు తిరస్కరణకు గురయ్యాయి. భారత్​లోని 7 కంపెనీలకు 5,428 హెచ్​-1బీ వీసాలు మాత్రమే జారీ అయ్యాయి. మొత్తం 85వేల వీసాల జారీలో ఇది 6 శాతం మాత్రమే.

అమెరికా సంస్థలైన అమెజాన్​, గూగుల్​ సంస్థలకు 4 శాతం, మైక్రోసాఫ్ట్​కు 6 శాతం, ఫేస్​బుక్​తో పాటు వాల్​మార్ట్​కు 3 శాతం మాత్రమే తిరస్కరణకు గురవడం గమనార్హం.

2020లో అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ పరిపాలనా విభాగం హెచ్​-1బీ వీసాల కొత్త నియమాలను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు పేర్కొంది నివేదిక. దీని ద్వార విదేశీ నిపుణులకు వీసాలు లభించడం మరింత క్లిష్టంగా మారనుందని తెలిపింది.

భారత్​-అమెరికాల మధ్య చర్చలు

భారతీయులకు హెచ్​-1బీ వీసాల జారీ విషయంలో అమెరికా-భారత్​ల మధ్య గతంలో పలుమార్లు చర్చలు జరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో అధ్యక్షుడు ట్రంప్​ తొలిసారి భారత పర్యటనకు వచ్చిన సందర్భంలోనూ హెచ్​-1బీ వీసాల అంశం తెరపైకి వచ్చింది. గతేడాది డిసెంబర్​లోనూ వాషింగ్టన్​లో ఇరు దేశాల మధ్య 2+2 చర్చల్లోనూ దీనిపై మాట్లాడారు.

నియమాలు కఠినం..

అమెరికాలోని ఐటీ కంపెనీలు విదేశీ నిపుణులను తాత్కాలికంగా నియమించుకునేందుకు జారీ చేసే హెచ్​-1బీ వీసాల విధానంలో ఆ దేశం కఠినంగా వ్యవహరిస్తోంది. వీసాల జారీని కొత్త నిబంధనలతో క్లిష్టం చేసింది అగ్రరాజ్యం. భారత్​, చైనాల నుంచి వందల మందిని ఈ వీసాల ద్వారానే నియమించుకుంటున్నాయి ఐటీ సంస్థలు. 2004 నుంచి ప్రతి ఏటా 65 వేల హెచ్​-1బీ వీసాలను జారీ చేస్తోంది అమెరికా. వీరితో పాటు అమెరికాలో చదివిన మరో 20,000 మందికి అవకాశం కల్పిస్తోంది.

ఇదీ చూడండి: కరోనా చికిత్స కోసం ఆసుపత్రిగా మారిన లాడ్జి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.