ETV Bharat / business

'అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో హైదరాబాద్ ఫార్మాసిటీ' - మంత్రి కేటీఆర్ వార్తలు

అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పలు దేశాల్లోని ఫార్మా క్లస్టర్ల తరహాలోనే హైదరాబాద్‌ ఫార్మాసిటీ ఉండాలని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. విండ్ ప్లోపై అధ్యయనం చేశామని, ఆ మేరకే మాస్టర్ ప్లానింగ్ ఉందని తెలిపారు. ఫార్మాసిటీ వ్యర్థాలు కేంద్రీకృతంగా శుద్ధి జరిగేలా ఏర్పాట్లు ఉంటాయన్నారు. ఫలితంగా కాలుష్య భయం లేకుండా ఉంటుందని వివరించారు.

ktr
ktr
author img

By

Published : Aug 25, 2020, 6:23 PM IST

హైదరాబాద్ ఫార్మాసిటీ పూర్తి అంతర్జాతీయ ప్రమాణాలతో కాలుష్యరహితంగా ఉండాలని పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఫార్మా సిటీపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఉన్నతాధికారులతో మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం కొనసాగున్న మౌలిక వసతుల నిర్మాణం, కంపెనీల నుంచి వస్తున్న స్పందన వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు. ఫార్మాసిటీ పనులు వేగంగా కొనసాగుతున్నాయన్న అధికారులు... పరిశ్రమల నుంచి మంచి స్పందన వస్తోందని, వందలాది కంపెనీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయని తెలిపారు.

కాలుష్య భయం లేకుండా

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా కట్టుదిట్టమైన మాస్టర్ ప్లానింగ్, పూర్తి కాలుష్యరహితంగా ఉండాలని తెలిపారు. అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో పలు దేశాల్లోని ఫార్మా క్లస్టర్ల తరహాలోనే ఫార్మాసిటీ ఉండాలని కేటీఆర్ అన్నారు. విండ్ ప్లో అధ్యయనం చేశామని, ఆ మేరకే మాస్టర్ ప్లానింగ్ ఉందని తెలిపారు. ఫార్మా యూనిట్లు అత్యధిక శాతం జిరో లిక్విడ్ డిశ్చార్జ్ యూనిట్లు ఉంటాయన్నారు. ఫార్మా సిటీ వ్యర్థాలు కేంద్రీకృతంగా శుద్ధి జరిగేలా ఏర్పాట్లు ఉంటాయని... కంపెనీల విచక్షణ లేకుండా పటిష్ఠంగా జరుగుతుందని అన్నారు. కాలుష్య భయం ఏమాత్రం ఉండదన్నారు.

అక్కడే నివాస సౌకర్యాలు

లివ్, వర్క్, లెర్న్ స్ఫూర్తితో ఫార్మాసిటీ ఏర్పాటవుతున్న నేపథ్యంలో అందులో పనిచేసేవారికి అక్కడే నివాస సౌకర్యాలుంటాయని మంత్రి చెప్పారు. ఫార్మాసిటీకి అనుబంధంగా అత్యుత్తమ విద్యాసంస్థలు ఏర్పడతాయని అన్నారు. స్థానికులకు ఉద్యోగాలు కల్పించే విషయమై కూడా సమావేశంలో చర్చించారు. అవసరమైన శిక్షణ ఇచ్చేలా స్థానిక శిక్షణా కేంద్రాల ఏర్పాటుపైనా చర్చించారు. పరిశ్రమల శాఖ, జిల్లా యంత్రాంగం ఇందుకోసం కలిసి పనిచేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.