ETV Bharat / business

మహిళలూ... పొదుపులో ఈ సూత్రాలు పాటిస్తున్నారా? - మహిళలు

పొదుపు... అందరికీ అవసరం. కానీ.. చాలా మంది మహిళలు పొదుపు విషయాన్ని భర్త, ఇంట్లోని పెద్దవాళ్లు చూసుకుంటారులే అని భావిస్తుంటారు. అది సరి కాదు. అతివలకు పొదుపు ఎందుకు అవసరం? పొదుపు చేసేందుకు వారికున్న అవకాశాలేంటి? అనే పూర్తి వివరాలు, వాటిపై నిపుణుల సలహాలు తెలుసుకోండి ఇప్పుడే.

women
మహిళలూ... పొదుపులో ఈ సూత్రాలు పాటిస్తున్నారా?
author img

By

Published : Mar 8, 2020, 3:36 PM IST

మహిళల జీవితం... ఎల్లప్పుడూ ఒడుదొడుకులు ఉండే రోలర్​ కోస్టర్ ప్రయాణం లాంటిది. ఎందుకంటే.. వాళ్లు ఇంటి నుంచి ఆఫీస్ వరకు.. పెళ్లి నుంచి తల్లి అయ్యేవరకు అనేక సవాళ్లు ఎదుర్కొంటుంటారు. కానీ... ఎన్నో క్లిష్టమైన బాధ్యతలు నిర్వర్తిస్తూ జీవిత ప్రయాణంలో తమ గురించి తాము మహిళలు ఆలోచించుకోవడం లేదని చాలా పరిశోధలు చెబుతున్నాయి.

ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాల విషయానికొస్తే.. పురుషులతో కన్నా మహిళలు ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటారు. ఎందుకంటే మహిళలు ఎక్కువ కాలం జీవిస్తారు, తక్కువ సంపాదిస్తారు. వారు చేసే పని నుంచి అనేక అవసరాల కోసం విరామాలు తీసుకుంటారు. ఒంటరి మహిళల పరిస్థితి మరింత ఇబ్బందిగా ఉంటుంది అనడంలో సందేహం లేదు.

వారికి వారే సాటి...

పొదుపు చేయడంలో కాస్త నిరాసక్తత చూపినా... ప్రారంభిస్తే మాత్రం మహిళలకు మహిళలే సాటి. ఓ నివేదిక ప్రకారం.. అదాయ వర్గాల్లో పురుషులతో పోలిస్తే.. మహిళలు 5 శాతం- 10 శాతం పొదుపులో ముందున్నట్లు తేలింది. అయితే పొదుపు చేసే మొత్తాలు మాత్రం పురుషులతో పోలిస్తే తక్కువగా ఉంటోంది. మహిళల్లో పొదుపు పట్ల పెరగాల్సిన అవగాహన, ఆవశ్యకతను ఈ విషయం తెలియచెబుతోంది.

మహిళలకు పొదుపునకు సంబంధించి నిపుణుల సలహాలు సూచనలు మీ కోసం....

'సిప్​'పై దృష్టిసారించండి..

మహిళల్లో పొదుపు అలవాటు అనేది ఇంటి నుంచి ప్రారంభమవుతుంది. ఒక సారి పాత రోజులు గుర్తు తెచ్చుకుంటే.. బేరమాడటం, అవసరమైన వాటిని మాత్రమే కొనడం, అనవసర ఖర్చులు తగ్గించుకోవడం వంటి పనులతో వీలైనంత ఎక్కువగా పొదుపు ఇంట్లోని మహిళలు చేసేవారు. దాన్ని అనుకరించేందుకు మీరూ ప్రయత్నించండి.

సిస్టమ్యాటిక్ ఇన్​వెస్ట్​మెంట్​ ప్లాన్​(సిప్)లో పొదుపు చేయడం ప్రారంభించండి. తక్కువ మొత్తాల్లో పెట్టుబడితో మిమ్మల్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఉన్న సాధానమే సిప్. రోజులు, నెలల వారీగా ఇందులో పెట్టుబడి పెట్టొచ్చు.

క్రమ శిక్షణతో పెట్టుబడుల కోసం మ్యూచువల్​ ఫండ్లు సిప్​ను అందిస్తాయి. ఇవి 'రూపాయి కాస్ట్ యావరేజింగ్', 'పవర్​ ఆఫ్​ కౌంపౌండింగ్​' పద్ధతిని అనుసరిస్తాయి. దీని ద్వారా దీర్ఘకాలంలో ఆకర్షణీయమైన ప్రతిఫలాలు అందుతాయి.

మహిళ్లలో స్వతంత్రంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాలు పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది ఫిక్సెడ్​ డిపాజిట్ల నుంచి మ్యూచువల్ ఫండ్లవైపు మొగ్గుచూపుతున్నారు.

స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి..

ఫిక్సెడ్ డిపాజిట్లు, రికరింగ్​ డిపాజిట్లు అనేవి కేవలం చిన్న చిన్న అవసరాలు తీర్చుకునేందుకు మాత్రమే పనికొస్తాయి. మీ పొదుపుతో ఎక్కువ రిటర్నులు రావాలనుకుంటే.. రిస్క్​ తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి రిస్క్ తీసుకునే మహిళ్లలో మీరు ఉంటే స్టాక్ మార్కెట్ల గురించి తెలుసుకోండి.

స్టాక్ మార్కెట్ల ద్వారా సంప్రదాయ పద్ధతులతో పోలిస్తే.. చాలా ఎక్కువ సంపాదించొచ్చు. మార్కెట్లలో పెట్టుబడి పెట్టాలనుకునే వారు.. లిస్టెడ్ కంపెనీల గురించి తెలుసుకుని, నాణ్యమైన స్టాక్​లను పెట్టుబడి కోసం ఎంపిక చేసుకోవడం మంచిది.

ఈఎల్​ఎస్​ఎస్..

ఈక్విటీ లింక్​డ్ సేవింగ్స్ పథకాలు (ఈఎల్​ఎస్​ఎస్).. ఉత్తమమైన పన్ను ఆదా మార్గాలు. వీటి ద్వారా ఎక్కువ రిటర్నులూ లభిస్తాయి. మ్యూచువల్​ ఫండ్లు అందించే విభిన్నమైన ఉత్పత్తులే ఈఎల్​ఎస్​ఎస్. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్​ 80సీ ప్రకారం పన్ను మినహాయింపు వస్తుంది. ఈఎల్​​ఎస్​ఎస్​ గత ఐదేళ్లలో 15 నుంచి 20 శాతం రిటర్నులు ఇచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

మహిళల్లో ఉన్న పొదుపు నైపుణ్యాలతో.. బాండ్ల ద్వారా వీలైనంత ఎక్కువగా రిటర్నులు పొందొచ్చు. మీ పోర్ట్​ఫోలియోలో బాండ్లను పెట్టుకోవడం మర్చిపోవద్దు.

బాండ్ల ద్వారా కచ్చితమైన, స్థిరమైన ఆదాయం వస్తుంది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లతో పోలిస్తే రిస్క్​ చాలా తక్కువ. కొన్ని బాండ్లు పన్ను మినహాయింపును అందిస్తున్నాయి.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)..

పురుషులతో పోలిస్తే.. మహిళలు సగటున 6-8 ఏళ్లు ఎక్కువగా జీవిస్తారు. ఇది చాలా పరిశోధనల్లో నిరూపితమైంది. దీని అర్థం మహిళల భవిష్యత్​ అవసరాలకు ఎక్కువ పొదుపు ఉండాలి అని.

అలాంటి ప్రయోజనాలు ఉండే రిస్క్​ లేని, కచ్చితమైన రిటర్నులు వచ్చే సదుపాయమే పీపీఎఫ్. ఏడాదికి రూ.1.5 లక్షల వరకు పీపీఎఫ్​లో పొదుపు చేయొచ్చు. దీని ద్వారా ఏడాదికి 8 శాతం వడ్డీ వస్తుంది.

లిక్విడ్ ఫండ్​లు..

అత్యవసర సమయాల్లో డబ్బు దొరకడం చాలా కష్టం. పొదుపు చేస్తున్న డబ్బులు అప్పటికప్పుడు వెనక్కి తీసుకోలేని పరిస్థితి. ఈ సమస్యకు పరిష్కారంగా త‌క్కువ స‌మ‌యంలోనే పెట్టుబ‌డుల‌ను న‌గ‌దుగా మార్చుకునేందుకు అవ‌కాశం క‌ల్పించే మ్యూచువ‌ల్ ఫండ్లు అందుబాటులో ఉన్నాయి. వాటినే లిక్విడ్ ఫండ్లు అంటారు.

లిక్విడ్ ఫండ్లు మ‌దుప‌ర్ల నిధుల‌ను స్వ‌ల్ప‌కాలిక స్థిరాదాయ ప‌థ‌కాల్లో (మ‌నీమార్కెట్ ) మ‌దుపుచేస్తారు. వాణిజ్య ప‌త్రాలు (క‌మ‌ర్షియ‌ల్ పేప‌ర్లు), స‌ర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్లు, ప్ర‌భుత్వ బిల్లులు (టీ బిల్లులు) వంటి స్వ‌ల్ప‌కాల మెచ్యూరిటీ ఉన్నవాటిలో పెట్టుబ‌డి పెడతారు. దీంతో యూనిట్ల‌ను విక్ర‌యించే మ‌దుప‌ర్ల‌కు స‌కాలంలోనే న‌గదు జ‌మ‌చేస్తారు. వీటిలో పెట్టుబడి పెట్టడం తెలివైన నిర్ణయంగా చెప్పొచ్చు.

బడ్జెట్​ తయారు చేసుకోండి..

ఏది అవసరమనుకుంటే అదే కొనుగోలు చేయండి. ఇంటి అద్దె, సరుకులు, బిల్లులు, ప్రయాణాలు, వినోదాల వంటి వాటి కోసం ప్రతి నెలా బడ్జెట్ వేసుకోండి. ఇప్పుడు కచ్చితమైన ఖర్చులను ఆదాయం నుంచి తీసివేయండి. ఇక మిగిలిన వాటి నుంచి కచ్చితంగా ఇంత మొత్తంలో పొదుపు చేయాలని లక్ష్యంగా పెట్టుకోండి. వీటి ద్వారా మిగులు పెరుగుతుంది.

తెలివిగా షాపింగ్ చేయండి..

షాపింగ్ అంటే అందరికీ ఇష్టమే. ఎక్కువగా బట్టలు, షూ వంటివి కొనుగోలు చేస్తుంటాం. అయితే షాపింగ్​లో అనవసరమైన వాటిని కొనకుండా ఉండేలా ప్రణాళికను రూపొందించుకోండి.

"ఖర్చులు పోను మిగిలిన మొత్తాన్ని పొదుపు చేయడం కాకుండా.. పొదుపు చేశాక మిగిలిన మొత్తాన్ని ఖర్చు చేయాలి" అనే వారెన్ బఫెట్ సూత్రాన్ని ఇక్కడ పాటించండి.

సహజత్వంతో ఆరోగ్యంగా ఉండాలి

మనలో చాలా మంది సౌందర్య సాధనాలకోసం ఎక్కువగా ఖర్చు చేస్తుంటారు. కృత్రిమ సౌందర్య సాధానాలతో ఆరోగ్యానికీ ప్రమాదమే. ఇందుకోసం వీలైనంత వరకు సహజంగా ఉంటూ.. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇలా ఉంటే అటు ఖర్చులు తగ్గడం సహా.. ఆరోగ్యంగానూ ఉంటారు.

-ఇందూ చౌదరి, ఆర్థిక నిపుణురాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.