ETV Bharat / business

రిస్క్ తక్కువ ఉండే ఉత్తమ పెట్టుబడులు ఇవే!

author img

By

Published : Apr 21, 2021, 1:16 PM IST

తక్కువ రిస్క్​తో పెట్టుబడికి అందుబాటులో ఉన్న సాధనాల్లో.. మ్యూచువల్ ఫండ్లు, గోల్డ్ ఈటీఎఫ్, ప్రభుత్వ బాండ్లు ముఖ్యమైనవి. మరి వీటిలో పెట్టుబడి పెట్టడం ఎలా? ఎలాంటి అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Invesements in Gold
బంగారంలో పెట్టుబడులు

మ్యూచువల్ ఫండ్​లు గత కొన్ని సంవత్సరాలుగా చాలా పాపులర్ అయ్యాయి. వేతన జీవుల్లో అయితే వీటికి చాలా ప్రాధాన్యం ఉంది. వివిధ కంపెనీల్లో మనం స్వతహాగా పెట్టుబడి పెట్టేందుకు బదులు మన తరఫున మ్యూచువల్ ఫండ్ల సంస్థలు ఆ పని చేస్తుంటాయి. సిప్(సిస్టమేటిక్ ఇన్వెస్ట్​మెంట్​ ప్లాన్​) రూపంలో నెల నెలా కొంచెం పెట్టుబడి పెట్టుకోవచ్చు.

బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు మార్గాలు ఉన్నాయి. బంగారం, డిజిటల్ గోల్డ్, గోల్డ్ ఈటీఎఫ్.. తదితరాలు ఇందులో ఉన్నాయి. అన్నింటికంటే గోల్డ్ ఈటీఎఫ్ ఉత్తమమనేది నిపుణుల మాట.

ఈటీఎఫ్ అంటే ఎక్ఛేంజీ ట్రేడెడ్ ఫండ్. ఇవి ఈక్విటీ ఆధారంగా సాధారణ షేర్లలానే స్టాక్ మార్కెట్​లో ట్రేడవుతుంటాయి. ఈటీఎఫ్ బంగారం ఆధారంగా ఉంటే అది గోల్డ్ ఈటీఎఫ్. ఇవి కూడా సాధారణ ఈటీఎఫ్​లలానే ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో ట్రేడవుతాయి.

పరిమిత కాలానికి నిర్ణీత వడ్డీ లేదా మారే వడ్డీతో ప్రభుత్వం తీసుకునే అప్పు తీసుకుంటుంది. దీనికి సంబంధించి ఇచ్చే బాండ్లను ప్రభుత్వ బాండ్లు అంటారు. ప్రభుత్వం వీటిని అందిస్తుంది కాబట్టి రిస్కు చాలా తక్కువగా ఉంటుంది. 10 సంవత్సరాల వ్యవధి బాండ్ విషయంలో వార్షిక రాబడి 6 శాతం నుంచి 6.25 శాతం వరకు ఉంటుంది.

ఇదీ చదవండి: ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లకు మళ్లీ ఆదరణ

వీటిలో పెట్టుబడి ఇలా..

మ్యూచువల్ ఫండ్లకు సంబంధించిన ఆస్తుల నిర్వహణకు అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు(ఏఎంసీ)ఉంటాయి. ఇవి మ్యూచువల్ ఫండ్లను ప్రకటిస్తుంటాయి. వీటిలో పెట్టుబడి పెట్టేందుకు.. ఆయా కంపెనీలతో పాన్ కార్డు, బ్యాంకు ఖాతా తదితర వివరాలతో ఖాతా తెరుచుకోవాల్సి ఉంటుంది. ఈ పద్ధతి ద్వారా కేవలం ఆ కంపెనీకి సంబంధించిన మ్యూచువల్ ఫండ్లలో మాత్రమే పెట్టుబడి పెట్టవచ్చు. అన్ని ఏఎంసీల మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టేందుకు వీలుగా కొన్ని ప్లాట్ ఫామ్​లు ఉన్నాయి. పేటీఎం మనీ, షేర్ ఖాన్ ఇన్​స్టా ​ఎంఎఫ్ లాంటివి దీనికి ఉదాహరణలు. వీటిల్లో ఖాతా తెరవటం ద్వారా అన్ని ఏఎంసీల మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయొచ్చు.

గోల్డ్ ఈటీఎఫ్​లలో పెట్టుబడి పెట్టేందుకు మాత్రం డీమ్యాట్ కావాలి. డీమ్యాట్ లేనట్లయితే గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్​తో కూడిన మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టవచ్చు.

వీటిని ఇష్యూ చేసేటప్పుడు రిటైల్ పెట్టుబడిదారుల బిడ్డింగ్ ద్వారా బాండ్లను పొందవచ్చు. ఇవి స్టాక్ మార్కెట్లో లిస్టవుతుంటాయి. డీమ్యాట్ అకౌంట్ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు. డీమ్యాట్ లేనట్లయితే.. ప్రభుత్వ సెక్యూరిటీ మ్యూచువల్ ఫండ్లలో కూడా పెట్టుబడి పెట్టవచ్చు.

ఇదీ చదవండి: మ్యూచువల్​ ఫండ్లు ఎన్ని రకాలు ఉంటాయో తెలుసా?

రిస్క్ ఏ విధంగా ఉంటుంది?

పెట్టిన పెట్టుబడి కోల్పోవటమే రిస్క్. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఏ పెట్టుబడి సాధనాన్ని బట్టి రిస్క్ అనేది ఉంటుంది. కొన్నింటిలో రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది. అదే సమయంలో కొన్నింటిలో రిస్క్ మరీ ఎక్కువగా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్లు, గోల్డ్ ఈటీఎఫ్, ప్రభుత్వ బాండ్లలలో చూసుకున్నట్లయితే మ్యూచువల్ ఫండ్లలోనే రిస్కు ఎక్కువగా ఉంటుంది.

ప్రభుత్వ బాండ్లను భారత ప్రభుత్వమే ఇష్యూ చేస్తుంది కాబట్టి రిస్క్ చాలా తక్కువ. అనుకున్న మొత్తం రిటర్న్స్ గ్యారంటీగా వస్తాయి. ప్రభుత్వ బాండ్లు 5 సంవత్సరాల కంటే ఎక్కువ గడువుతో సాధారణంగా లభిస్తాయి. కాబట్టి దీర్ఘ కాలంలో రిస్కు లేకుండా పరిమితంగా పెట్టుబడి రావాలనుకునే వారు వీటిని ఎంచుకోవచ్చు. ఎక్కువ స్థాయిలో రిటర్న్స్ కావాలనుకుంటే వేరే పెట్టుబడి సాధనాలను ఎంచుకోవటం ఉత్తమం.

బంగారం ధరలకు అనుగుణంగా గోల్డ్ ఈటీఎఫ్​ల రాబడి ఉంటుంది. బంగారం ధర పెరిగనట్లయితే దీనిపై రాబడి కూడా పెరుగుతుంది. బంగారం ధర తగ్గినట్లయితే రాబడి కూడా తగ్గుతుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి బంగారంపై రాబడి 20 శాతంపైగా ఉన్నట్లు కమోడిటీ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. బంగారాన్ని సాధారణంగా సురక్షిత పెట్టుబడిగా చూడవచ్చు. అయితే మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా వీటిలో రిస్కు ఉంటుంది. బంగారం ధరకు అనుగుణంగా రాబడి పొందాలనుకునే వారు, భౌతిక బంగారం కొనుగోలు చేసుకోవాలనుకునే వారు, భవిష్యత్తులో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు.. వీటిని కొనుగోలు చేయవచ్చు. వీటిలో రాబడి అనేది బంగారం ధరపై ఆధారపడి ఉంటుంది.

ఇదీ చదవండి: యూఏఎన్​ లేకుండానే పీఎఫ్​ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చా?​

ఎవరెవరికి ఏవేవి?

దీర్ఘ కాలంలో సంపద సృష్టించుకునేందుకు మ్యూచువల్ ఫండ్లు సరైన సాధనాలు. మ్యూచువల్ ఫండ్లలో డెట్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు అని ఉంటాయి. వీటిలో డెట్ ఫండ్లలో రిస్కు తక్కువగా ఉంటుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో కూడా తక్కువ రిస్కు ఉండే మ్యూచువల్ ఫండ్లు ఉంటాయి.

మ్యూచువల్ ఫండ్లలో ఒకేసారి కొంత మొత్తం పెట్టుబడి పెట్టుకోవచ్చు. సిప్ రూపంలో నెలవారీగా కొంచెం కొంచెం పెట్టుబడి పెట్టవచ్చు. రిస్కుకు తగ్గట్లు పెట్టుబడి పెట్టుకోవచ్చు. అంతేకాకుండా పెట్టుబడి వ్యవధికి అనుగుణంగా కూడా ఇన్వెస్ట్​ చేసేది ఎంచుకోవాల్సి ఉంటుంది. వార్షికంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు 12 శాతం నుంచి 25 శాతం వరకు రాబడిని ఇస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

స్వల్ప కాలానికి అయినట్లయితే డెట్ ఆధారిత మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టుకోవచ్చు. కొంత ఎక్కువ సమయం ఉన్నట్లయితే ఈక్విటీ, అందులో కూడా ఎక్కువ హెచ్చు తగ్గులు ఉండని కంపెనీల్లో పెట్టుబడి పెట్టే ఫండ్స్​ను ఎంచుకోవాలి.

పెట్టుబడి వ్యవధి, రిస్కు తీసుకునే సామర్థ్యం, ఆశించే రాబడి ఆధారంగా పెట్టుబడి నిర్ణయం తీసుకోవాలి. ఎక్కువ రాబడి కావాలంటే సాధారణంగా ఎక్కువ రిస్కు తీసుకోవాల్సి ఉంటుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లకు ఇది సరిగ్గా వర్తిస్తుంది. అన్ని విషయాలు నిశితంగా గమనించి పెట్టుబడి నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పెట్టుబడి పెట్టే ముందు అవసరమైతే ఆర్థిక నిపుణులను వ్యక్తిగతంగా సంప్రదించాలని కూడా చెబుతున్నారు.

ఇదీ చదవండి: చేసే పనులు వింత- శాలరీ ఊహించనంత!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.