ఈ రోజుల్లో అందరికి ఫిట్‌నెస్ మీద ఆసక్తి పెరిగిపోయింది. మన క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఫిట్‌నెస్‌కి సంబంధించి అవగాహన పెంచడంలో దోహద పడుతున్నారు. అందరూ ఫిట్‌గా ఉండేందుకు ఇష్టపడుతున్నారు. దానికోసం ఎంత ఖర్చు అయినా పెట్టేందుకు వెనుకాడటం లేదు. ఫిట్‌గా ఉండాలనుకోవడం మంచిదే అయినప్పటికీ అవసరానికి మించి ఖర్చు చేయడం మంచిది కాదంటున్నారు ఆర్థిక నిపుణులు. మరి దానికోసం ఎంత ఖర్చు చేయాలి ? ఎంత చేయకూడదు? తెలుసుకుందామా…!
నెలకు 3 నుంచి 5 వేలు
ఫిట్‌నెస్, జిమ్, మారథాన్ క్లబ్, జుంబా క్లాసుల కోసం సగటుగా నెలకు రూ.3 వేల నుంచి రూ.5 వేలు ఖర్చు చేస్తున్నారని సంబంధిత రంగ నిపుణలు చెప్తున్నారు. ఫిట్‌నెస్, దానికి అవసరమైన సామగ్రి, దుస్తులు వంటివి కొనుగోలు చేసేందుకు వినియోగం పెరుగుతోంది. జిమ్ మెంబర్‌షిప్, స్పోర్ట్స్ వస్తువులు, సామగ్రి, దుస్తులు, డైట్ కోసం డబ్బును వెచ్చిస్తున్నారు. ఇందులో ఎక్కువగా 17 నుంచి 40 సంవత్సరాల వయస్సువారు ఉంటున్నారని సంబంధిత వ్యక్తులు చెప్తున్నారు. ఇందుకు ఇష్టపడతారని తెలిపారు. ముంబయి వంటి కొన్ని నాగరిక ప్రాంతాలలో ఫిట్‌నెస్ కోసం కొంతమంది సంవత్సరానికి రూ.50 వేల కంటే కూడా ఎక్కువ ఖర్చు పెట్టేందుకు వెనుకాడటంలేదు.
ఇండస్ట్రీ విలువ
రిటైల్ ఫిట్‌నెస్ ఇండస్ట్రీ మొత్తం కొనుగోళ్లలో హైకింగ్, ట్రెక్కింగ్ వంటి వాటికి 27 శాతం, ఫిట్‌నెస్ సామగ్రికి సంబంధించిన వినియోగం19.5 శాతంగా ఉంటోంది. నెలవారి ఖర్చు - జిమ్‌పిక్ నివేదిక ప్రకారం దేశంలో 2017 ముగిసేనాటికి, రిటైల్ ఫిట్‌నెస్ ఇండస్ట్రీ విలువ రూ.7 వేల కోట్లుగా పేర్కొంది. దేశంలోని సగటు వ్యక్తులు వారి ఆదాయంలోంచి నెలకు 3 నుంచి 5 శాతం ఫిట్‌నెస్‌కి ఉపయోగిస్తున్నారు. నివేదిక ప్రకారం బెంగళూరులో నివిసించే వివేక్ అయ్యర్ 36, ప్రాజెక్ట్ మేనేజర్‌కి అతనికి సెక్లింగ్ అంటే ఆసక్తి వీలున్నప్పుడల్లా సైక్లింగ్‌లో పాల్గొనేందుకు ఉత్సాహం కనబరుస్తాడు. నెల వేతనంలో 5 శాతం ఫిట్‌నెస్, సైక్లింగ్ కోసం వినియోగిస్తాడు. అదేవిధంగా పుణెకి చెందిన సునీల్ 39, పుణె ధక్కన్ అథ్లెట్స్ ఫిట్‌నెస్ గ్రూప్ మెంబర్ నెలకు దీనికోసం 3 వేలు ఖర్చు పెడతాడు. రవాణా ఖర్చులు, మారథాన్ రిజిస్ర్టేషన్లు వంటి వాటికి నెలకు రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు ఖర్చవుతాయని వారు అంటున్నారు. ఎంత చేయాలి? ఫిట్‌నెస్ ఖర్చు కూడా ఇటీవల బాగా పెరిగింది. యోగా క్లాసులకు ఒక్కోరికి రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు తీసుకుంటున్నామని నిర్వాహకులు చెప్తున్నారు. అయితే ఇందులో చాలా మంది మెంబర్‌షిప్ తీసుకున్నప్పటికీ క్లాసులకి సరిగా హాజరవరని కూడా చెప్పారు.
30 శాతానికి మించకుండా
ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఫిట్‌నెస్ మీద ఖర్చు చేసింది తిరిగి రాదు. నెలకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ఫిట్‌నెస్ కోసం ఖర్చు చేయడం పెద్ద విషయమేమి కాదు. అయితే అన్ని పొదుపు విషయాల గురించి ఆలోచించి మీకు తగినంత ఖర్చు చేయడం మంచిది. ఫిటనెస్, వినోదం, ప్రయాణాలు, ఫిట్‌నెస్, సినిమాలు వంటి ఖర్చుల విషయంలో విచక్షణ ఉండాలి. మీ ఆదాయంలో 30 శాతానికి మించి ఈ ఖర్చులు ఉండకుండా చూసుకోవాలిని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.