హెచ్ఎమ్డీ గ్లోబల్ తన సరికొత్త నోకియా 2.3 స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. దీని ధరను 109 యూరోలు(సుమారు రూ.8,600)గా నిర్ణయించింది. త్వరలోనే భారత మార్కెట్లో భారీ ఎత్తున విడుదల చేస్తామని ప్రకటించింది. భారత్‌లో ధర ఎంత ఉంటుందో మాత్రం వెల్లడించలేదు.
నోకియా 2.3 ఫీచర్స్
- 6.2 అంగుళాల స్క్రీన్
- 2 రోజులపాటు వచ్చే బ్యాటరీ
- డ్యూయెల్ కెమెరా
- ఉత్తమ చిత్రం ఎన్నుకునే 'షాట్' ఫీచర్
- ప్రత్యేకమైన గూగుల్ అసిస్టెంట్ బటన్
ఈ ఆండ్రాయిడ్ 10 రెడీ ఫోన్‌కు మూడేళ్ల పాటు ప్రతి నెలా సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయని, రెండేళ్లపాటు ఓఎస్ అప్డేట్లు వస్తామని స్పష్టం చేసింది హెఎమ్డీ గ్లోబల్. కాలక్రమేణా ఈ స్మార్ట్‌ఫోన్‌ను మరింతగా మెరుగుపరుస్తామని కంపెనీ తెలిపింది.
పూర్వ వైభవం..
భారత్‌లో మొబైల్ ఫోన్లు ప్రవేశించిన తొలి 7-8 సంవత్సరాల్లో నోకియా బ్రాండ్ ఫోన్లు ఎదురులేని అధిపత్యాన్ని చెలాయించాయి. తరువాత దక్షిణ కొరియా దిగ్గజం శామ్సంగ్ ప్రవేశం, తక్కువ ధరకు లభించే చైనా ఫోన్ల రాకతో నోకియా అధిపత్యానికి గండిపడింది.
దూసుకుపోతున్న భారత్
ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న స్మార్ట్‌ఫోన్ మార్కెట్లలో భారత్ ఒకటి. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) ప్రకారం, భారత్‌లో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు 2018 జులై-సెప్టెంబర్‌తో పోల్చితే 2019లో ఇదే కాలానికి 9.3 శాతం నుంచి 46.6 శాతానికి పెరిగాయి. షియోమీ 27.1 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది. తరువాత స్థానాల్లో... శాంసంగ్ (18.9 శాతం), వివో (15.2 శాతం), రియల్మీ (14.3 శాతం), ఒప్పో (11.8 శాతం) ఉన్నాయి.
ఇదీ చూడండి: అలా ఎలా చంపేస్తారు?: దిశ ఎన్‌కౌంటర్‌పై మేనక