ETV Bharat / business

ఆ కంపెనీ మూసివేతతో.. దేశంలో సూదుల సంక్షోభం!

రోజూ 1.5 కోట్ల సూదులు, 80 లక్షలకుపైగా సిరంజీలు ఉత్పత్తి చేసే హిందూస్థాన్​ సిరంజీస్​ అండ్​ మెడికల్​ డివైజెస్​ సంస్థ మూతపడింది. దిల్లీలో కాలుష్యం కారణంగా హరియాణాలోని తమ కంపెనీని మూసివేసినట్టు పేర్కొంది. అయితే.. ప్రస్తుత కొవిడ్​ కాలంలో చికిత్సా కార్యక్రమాలపై ఇది ప్రతికూల ప్రభావం చూపించే అవకాశముంది.

syringes production shortage
ఆ కంపెనీ మూసివేతతో.. దేశంలో సూదుల సంక్షోభం!
author img

By

Published : Dec 11, 2021, 2:18 PM IST

దేశ రాజధాని దిల్లీలో కాలుష్య నియంత్రణలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు హరియాణాలోని ఫరీదాబాద్‌లో ఉన్న తమ కంపెనీని మూసివేసినట్లు 'హిందూస్థాన్‌ సిరంజీస్‌ అండ్‌ మెడికల్‌ డివైజెస్‌(హెచ్‌ఎండీ)' వెల్లడించింది. అయితే, దీని వల్ల దేశవ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌తో పాటు ఇతర చికిత్సా కార్యక్రమాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని కంపెనీ ఎండీ రాజీవ్‌నాథ్‌ తెలిపారు.

హెచ్‌ఎండీలో రోజూ 1.5 కోట్ల సూదులు, 80 లక్షల సిరంజీలు ఉత్పత్తి చేస్తున్నట్లు రాజీవ్‌నాథ్‌ పేర్కొన్నారు. ఇప్పుడు ఫ్యాక్టరీ మూతపడడం వల్ల దేశవ్యాప్తంగా కనీసం రోజుకు 1.2 కోట్ల సిరంజీల కొరత ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే భారత్‌తో సహా దేశవ్యాప్తంగా సిరంజీల కొరత ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఎగుమతులపై నిషేధం కూడా విధించిందన్నారు. దేశవ్యాప్తంగా నివారణ, టీకా కార్యక్రమాల్లో ఉపయోగించే సిరంజీల్లో 66శాతం హెచ్‌ఎండీనే అందిస్తోందని తెలిపారు. ఫ్యాక్టరీ మూసివేత వల్ల ఈ కార్యక్రమాల్లో జాప్యం జరిగే ప్రమాదం ఉందన్నారు. అలాగే ధరలు కూడా పెరగొచ్చని తెలిపారు.

ఈ విషయంపై ప్రధాని మోదీకి లేఖ రాసినట్లు రాజీవ్‌నాథ్‌ తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో జాతీయ విపత్తు నిర్వహణ చట్టం కింద సిరంజీలు తయారీ చేసే కేంద్రాలను జాతీయ ప్రాధాన్యంగల వస్తువులను ఉత్పత్తి చేసే కంపెనీలుగా గుర్తించాలని లేఖలో విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:- ఔషధ అమ్మకాలు మళ్లీ పైపైకి.. కారణం అదే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.