ETV Bharat / business

ఎలక్ట్రిక్​ బైక్​ల కోసం 20 వేల మంది మెకానిక్​లు! - హీరో ఎలక్ట్రిక్​ వాహన విక్రయ ప్రణాళికలు

దేశీయ విద్యుత్ వాహనాల తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్​ భారీ భవిష్యత్ ప్రణాళికను ప్రకటించింది. తమ బైక్​లలో తలెత్తే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం చూపేలా.. దేశవ్యాప్తంగా 20 వేల మంది మెకానిక్​లకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపింది. దీనితో పాటు రానున్న రెండేళ్లలో 20 వేల ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయనున్నట్లు కూడా వెల్లడించింది.

Hero Electric scooter
హీరో ఎలక్ట్రిక్ స్కూటర్​
author img

By

Published : Apr 4, 2021, 3:41 PM IST

విద్యుత్​ ద్విచక్రవాహనాలు కొనుగోలు చేసేవారిలో నమ్మకం పెంచేందుకు హీరో ఎలక్ట్రిక్​ కీలక నిర్ణయం తీసుకుంది. తమ వాహనాల్లో తలెత్తే ఎలాంటి సమస్యలనైనా పరిష్కరించేలా.. దేశవ్యాప్తంగా 20 వేల మంది మెకానిక్​లకు (రోడ్ల పక్కల బైక్​ పాయింట్లు నడిపిస్తున్న వారికి) ప్రత్యేక శిక్షణ ఇవ్వనునట్లు ప్రకటించింది. రానున్న మూడేళ్లలో ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు తెలిపింది.

దీనితో పాటు వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా 20 వేల ఛార్జింగ్ స్టేషన్లను నెలకొల్పాలని కూడా హీరో ఎలక్ట్రిక్​ ప్రణాళికలు రూపొందిస్తోంది.

ఇప్పటికే 4 వేల మంది మెకానిక్​లకు శిక్షణ ఇచ్చింది ఈ సంస్థ​. దేశవ్యాప్తంగా 1,500 ఛార్జింగ్ పాయింట్లు కూడా ఉన్నాయి.

లక్ష యూనిట్లు లక్ష్యం..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లక్ష యూనిట్లు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు హీరో ఎలక్ట్రిక్​ ఎండీ నవీన్​ ముంజల్​ పేర్కొన్నారు. 2020-21తో పోలిస్తే ఈ సంఖ్య దాదాపు రెండింతలు. గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద హీరో ఎలక్ట్రిక్ 53 వేల యూనిట్లు విక్రయించింది.

ప్రస్తుతం తమ ఫ్యాక్టరీ ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 75 వేల యూనిట్లుగా తెలిపారు నవీన్​ ముంజల్​. దీనిని మూడు లక్షల యూనిట్లకు పెంచనున్నట్లు వెల్లడించారు. రానున్న రెండేళ్లలో వచ్చే డిమాండ్​కు ఈ సామర్థ్యం సరిపోతుందని వివరించారు.

ఇదీ చదవండి:ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లతో 12 వేల ఉద్యోగాలు!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.