కొవిడ్-19 వ్యాధికి గురయిన కుటుంబాల్లోని పిల్లల(Covid 19 Children) చదువులకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఉపకారవేతనం అందించనుంది. 2020 జనవరి తరవాత కొవిడ్ వల్ల తల్లి లేదా తండ్రి లేదా ఇద్దర్నీ కోల్పోయిన, జీవనోపాధి పోయిన కుటుంబాల్లోని పిల్లలకు ఒకసారి ఆర్థిక సాయం రూపంలో రూ.15,000 నుంచి రూ.75,000 వరకు ఇవ్వనుంది. దరఖాస్తు సమర్పించేందుకు చివరి తేదీ అక్టోబరు 31, 2021.
తరగతుల వారీగా
- 1-5 తరగతులకు- రూ.15,000 6-8 తరగతులకు- రూ.18,000
- 9-12 తరగతులకు- రూ.21,000 డిప్లొమా కోర్సులు - రూ.20,000
- గ్రాడ్యుయేషన్ (బీకామ్, బీఎస్సీ, బీఏ, బీసీఏ తదితర) - రూ.30,000
- పోస్ట్ గ్రాడ్యుయేషన్ (ఎంకామ్, ఎంఏ తదితర) - రూ.35,000
- ప్రొఫెషనల్ (బీటెక్, ఎంబీబీఎస్, ఎల్‌ఎల్‌బీ, బీఆర్క్, నర్సింగ్)- రూ.50,000
- పోస్ట్ గ్రాడ్యుయేషన్ (ఎంటెక్, ఎంబీఏ) కోర్సులు- రూ.55,000- 75,000
ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు, భోజనం, ఇంటర్నెట్, ఆన్‌లైన్ లెర్నింగ్ డివైజ్, పుస్తకాలు, స్టేషనరీ లాంటి విద్యా సంబంధిత అవసరాల ఖర్చు కోసమే ఈ స్కాలర్‌షిప్‌ను ఉపయోగించుకోవాలి.
ఈ పత్రాలు సమర్పించాలి
- 2019-20లో చదివిన కోర్సుకు సంబంధించిన మార్కుల పత్రం, లేదా 2018-19 సంవత్సరానిదైనా సమర్పించవచ్చు. ప్రస్తుత సంవత్సరంలో చదివేందుకు తీసుకున్న కోర్సు ప్రవేశ పత్రం (ఫీజు రశీదు, అడ్మిషన్ రశీదు, విద్యా సంస్థ ఐడీకార్డు, బోనఫైడ్ సర్టిఫికేట్) అప్‌లోడ్ చేయాలి.
- ఆధార్ / ఓటర్/పాన్ కార్డు/ డ్రైవింగ్ లైసెన్సు
- తల్లిదండ్రుల మరణ ధ్రువీకరణ పత్రం లేదా జీవనోపాధి కోల్పోయినట్లు రుజువుచేసే పత్రం; ఈ విషయం తెలిసిన ఇద్దరు వ్యక్తుల వివరాలు (స్కూలు టీచరు, డాక్టర్, ప్రిన్సిపల్, ప్రభుత్వ అధికారి)
- అభ్యర్థి లేదా తల్లిదండ్రుల బ్యాంకు ఖాతా వివరాలు
- ఫొటో ఎలా దరఖాస్తు చేయాలి..
- బడ్డీ4స్టడీలో నమోదు చేసుకుని రిజిస్టర్డ్ ఐడీ పొందాలి...ఆ తర్వాత 'లైవ్ అప్లికేషన్ ఫారం'నకు వెళ్తే, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పరివర్తన్ కొవిడ్ క్రైసిస్ సపోర్ట్ స్కాలర్‌షిప్ అప్లికేషన్ ఫారం కనిపిస్తుంది.
- స్టార్ట్ బటన్‌ను నొక్కడం ద్వారా దరఖాస్తులో అడిగిన వివరాలను పూరించి, అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి: దసరా వచ్చేస్తోంది.. ఖర్చుల విషయంలో జాగ్రత్త పడండిలా!