ETV Bharat / business

డోమినోస్ కస్టమర్ల డేటా లీక్​ - పిజ్జా బ్రాండ్ డొమినోస్ కస్టమర్ల డేటా హ్యాక్​

ప్రముఖ పిజ్జా బ్రాండ్​ డోమినోస్ కస్టమర్ల డేటా హ్యాకింగ్​కు గురైంది. కానీ కస్టమర్ల ఫైనాన్సియల్​ డేటా సురక్షితంగానే ఉందని సైబర్​ సెక్యురిటీ నిపుణుడు రాజశేఖర్​ రాజహారియ తెలిపారు.

dominos
పిజ్జా బ్రాండ్ డొమినోస్ డేటా లీక్​
author img

By

Published : May 23, 2021, 5:09 AM IST

పిజ్జా బ్రాండ్​ డోమినోస్ కస్టమర్ల డేటా హ్యాకింగ్​కు గురైందని ఓ సైబర్​ సెక్యురిటీ నిపుణుడు వెల్లడించారు. కానీ కస్టమర్ల ఫైనాన్సియల్​ డేటా సురక్షితంగానే ఉందని తెలిపారు. హ్యాక్​ అయిన వెబ్​సైట్ ద్వారా హ్యాకర్లు వినియోగదారులకు సంబంధించిన ఆర్డర్లను, వారు ఏ ప్రాంతం నుంచి చేశారు అనేది మాత్రమే తెలుసుకోగలరని సైబర్​ సెక్యురిటీ నిపుణుడు రాజశేఖర్​ రాజహారియ తెలిపారు.

ఈ డేటాతో వినియోగదారుల సమాచారంపై నిఘా ఉంచే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. భారతీయులు ఆర్డర్​ చేసిన 18 కోట్ల ఆర్డర్లకు సంబంధించిన సమాచారం డార్క్​వెబ్​లో బహిర్గతమైందని తెలిపారు.

అయితే దీనిపై డోమినోస్​ యాజమాన్యం స్పందించింది. హ్యాక్ అయిన విషయాన్ని నిర్ధరించింది. ఈ కారణంగా భద్రతా పరమైన ఇబ్బందులు తలెత్తాయని తెలిపింది. కానీ కస్టమర్ల ఆర్థికపరమైన సమాచారం క్షేమంగానే ఉందని వెల్లడించింది. వినియోగదారులకు సంబంధించిన ఫైనాన్సియల్​ డేటా దుర్వినియోగానికి గురయ్యే అవకాశమే లేదని సంస్థ పురుద్ఘాటించింది.

ఇదీ చదవండి: 'వైద్యశాస్త్రంపై రాం​దేవ్​కు దురుద్దేశమేమీ లేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.