ETV Bharat / business

నేడు జీఎస్​టీ మండలి భేటీ.. కొవిడ్ పన్నులే అజెండా! - బ్లాక్‌ ఫంగస్‌ మందులపై పన్ను రేట్లు ఎంత?

కరోనా చికిత్సలో వినియోగించే అత్యవసర ఔషధాలపై పన్ను మినహాయింపు కలిగించే అంశాలే అజెండాగా నేడు జీఎస్​టీ కౌన్సిల్ సమావేశం కానుంది. ముఖ్యంగా బ్లాక్ ఫంగస్ మందులపై నిర్ణయం తీసుకోనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

GST
జీఎస్​టీ
author img

By

Published : Jun 12, 2021, 5:26 AM IST

Updated : Jun 12, 2021, 7:02 AM IST

కొవిడ్‌ అత్యవసర వస్తువులు, బ్లాక్‌ ఫంగస్‌ మందులపై పన్నురేట్ల తగ్గింపుపై చర్చించేందుకు నేడు జీఎస్​టీ మండలి సమావేశం కానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు వర్చువల్‌గా జరిగే భేటీలో రాష్ట్రాల ఆర్థికమంత్రులు పాల్గొననున్నారు. మెడికల్ ఆక్సిజన్, పల్స్ ఆక్సిమీటర్లు, హ్యాండ్ శానిటైజర్లు, వెంటిలేటర్లు వంటి వస్తువులపై జీఎస్​టీ రాయితీల అంశంపైనా చర్చ జరగనుంది.

గత నెల 28న జరిగిన జీఎస్​టీ మండలి సమావేశంలో పన్ను మినహాయింపులు సామాన్యులకు చేరాలనే విషయమై భాజపా, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల సీఎంల మధ్య వాగ్వాదం జరగటంతో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పీపీఈ కిట్లు, మాస్క్‌లు, టీకాలకు పన్ను మినహాయింపు విషయమై మంత్రుల బృందం ఇప్పటికే నివేదిక సమర్పించింది.

ఈ నివేదికతో పాటు.. బ్లాక్‌ ఫంగస్‌ మందులపై పన్ను తగ్గింపు అంశంపై నేడు జరగనున్న భేటీలో చర్చించనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి.

Last Updated : Jun 12, 2021, 7:02 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.