చెరుకు మద్దతు ధరను (ఎఫ్ఆర్పీ) తగ్గించాలన్న వ్యాపారుల డిమాండ్‌ని కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ తోసిపుచ్చారు. శుక్రవారం జరిగిన భారత షుగర్ మిల్స్ సంఘం 86వ వార్షిక సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెరుకు పరిశ్రమకు సంబంధించి సూచనలు చేశారు. దీర్ఘకాలంగా అమలులో ఉన్న ఎఫ్ఆర్పీ పద్ధతిని ఇప్పుడు మార్చడం క్షేత్రస్థాయిలో సాధ్యం కాదన్నారు.
లాభాలకు మార్గం వెతకాలి...
ప్రభుత్వంపైన ఒత్తిడి లేకుండా పరిశ్రమ లాభాసాటిగా ఉండే మార్గం కోసం ప్రయత్నించాలని గోయల్ అన్నారు. 60 లక్షల టన్నుల చెరుకు ఎగుమతిపై ప్రభుత్వం నిర్ణయించిన మూడు వేల కోట్ల రాయితీ పరిశ్రమకు మేలు చేస్తుందన్నారు. ఆదాయం పెరిగేందుకు ఇథనాల్, ఉత్పత్తిని పెంచాలని సూచించారు. ఈ ఏడాది చక్కెర ఉత్పత్తి 20 శాతం పెరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. బాకీ ఉన్న గతేడాది రాయితీలను కూడా త్వరలో అందజేస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి : మోదీజీ మరోసారి అసత్యం పలికారు: రాహుల్