ప్రావిడెంట్ ఫండ్ ఖాతాల్లో జమచేసే డిపాజిట్ పరిమితిని కేంద్రం ఏడాదికి ఐదు లక్షలకు పెంచింది. ఆ మొత్తంపై వచ్చే వడ్డీపై పన్నుమినహాయింపునిచ్చింది. అయితే రిటైర్మెంట్ ఫండ్‌కు యాజమాన్యం చందా లేని కేసుల్లోనే వర్తిస్తుందని తెలిపింది.
ఏడాదిలో ఉద్యోగుల పీఎఫ్ చందా రెండున్నర లక్షలు దాటితే పన్ను విధిస్తామని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. ఈ మేరకు ఆర్థిక బిల్లు 2021కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఫలితంగా 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను ప్రతిపాదనలు అమల్లోకి వచ్చాయి. మూజువాణి ఓటుతో ఆమోదం బిల్లుకు 127 సవరణలు చేశారు. పీఎఫ్ ఖాతాలకు సంబంధించి వడ్డీలపై పన్ను కేవలం ఒకశాతం చందాదారులకు మాత్రమే వస్తారని వెల్లడించారు.
మిగతావారి పీఎఫ్ చందా, ఇంధనధరలపై అధిక పన్నులకు సంబంధించి పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన నిర్మల.. పెట్రోల్, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే అంశమై వచ్చే జీఎస్టీ మండలిలో చర్చించేందుకు సిద్ధమన్నారు. అయితే ఇంధన ధరలపై పన్ను అంశం కేవలం కేంద్రం పరిధిలోనే లేదని రాష్ట్రాలకు సంబంధిచిన అంశమన్నారు
ఇదీ చదవండి: భారత్ ఆశలకు కరోనా గండి- లక్ష్య సాధన మూడేళ్లు ఆలస్యం!