ETV Bharat / business

పెట్రోల్​, డీజిల్​పై ఎక్సైజ్ సుంకం రూ.3 వడ్డింపు

పెట్రోల్​, డీజిల్​పై ఎక్సైజ్​ సుంకాన్ని రూ.3 పెంచింది కేంద్ర ప్రభుత్వం. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతున్న వేళ ధరలను సర్దుబాటు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. రోడ్​ సెస్​ను కూడా రూ.1 పెంచింది. ఫలితంగా కేంద్రానికి రూ.39 వేల కోట్ల అదనపు ఆదాయం లభించనుంది.

petrol
పెట్రోల్
author img

By

Published : Mar 14, 2020, 9:55 AM IST

Updated : Mar 14, 2020, 12:38 PM IST

అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా పెట్రోల్​, డీజిల్​పై ఎక్సైజ్​ సుంకాన్ని రూ.3 పెంచింది.

ఫలితంగా లీటర్​ పెట్రోల్​పై ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్​ సుంకం రూ.2 నుంచి రూ.8కి పెంచింది. డీజిల్​పై రూ.4 వడ్డించింది. అంతేకాకుండా రోడ్డు సెస్​ను లీటర్​పై రూ.1 అదనంగా పెంచి రూ.10కి తీసుకొచ్చింది. ఈ నిర్ణయాలతో ప్రస్తుతం లీటర్​ పెట్రోల్​పై సుంకం రూ.22.98, డీజిల్​పై రూ.18.83కు చేరింది. 2014లో మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు పెట్రోల్​పై పన్ను లీటర్​కు రూ.9.48, డీజిల్​పై రూ.3.56గా ఉండేది. 2014 నవంబర్​ నుంచి 2016 జనవరి మధ్య 9 సార్లు ఎక్సైజ్​ సుంకాన్ని పెంచింది మోదీ సర్కారు.

రూ.39 వేల కోట్ల ఆదాయం

సుంకాల పెంపుతో పెట్రోల్​, డీజిల్​ ధరల్లో ఎలాంటి మార్పులు ఉండవు. ఫలితంగా కేంద్రానికి రూ.39 వేల కోట్ల ఆదాయం లభించనుంది.

పెట్రోల్, డీజిల్​పై ఎక్సైజ్ సుంకం పెంచటం వల్ల సాధారణ ధరల పెరుగుదలకు దారితీస్తుంది. కానీ, అంతర్జాతీయ చమురు ధరల క్షీణత కారణంగా ధరల సర్దుబాటు కోసం ఈ నిర్ణయం తీసుకుంది కేంద్రం.

రోజువారీ సవరణల ప్రకారం నేడు పెట్రోల్​పై 13 పైసలు, డీజిల్​పై 16 పైసలు తగ్గాయి. దిల్లీలో లీటర్​ పెట్రోల్ ధర రూ.69.87, డీజిల్​ రూ.62.58గా ఉంది.

ఇదీ చూడండి: అక్కడా సానుకూలతే... చమురు ధర 6% వృద్ధి

Last Updated : Mar 14, 2020, 12:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.