ఉల్లి ధరలు మరింత దిగిరావడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుత పంట సంవత్సరం(2019 జులై-2020 జూన్)లో ఉల్లి దిగుబడి 7శాతం పెరిగే అవకాశముంది. 2018-19లో 22.81 మిలియన్ టన్నులుగా ఉన్న ఉల్లి ఉత్పత్తి.... ఈసారి 24.45 మిలియన్ టన్నులకు చేరుతుందని కేంద్రం అంచనా వేసింది. ఉల్లి సహా వేర్వేరు కూరగాయలు, పండ్ల దిగుబడిపై అంచనాలతో ఈమేరకు నివేదిక విడుదల చేసింది కేంద్ర వ్యవసాయ శాఖ.
అదే బాటలో ఆలూ, టమాట
గతేడాదితో పోల్చితే ఈసారి బంగాళదుంప, టమాట దిగుబడి పెరుగుతుందని కేంద్రం అంచనా వేసింది. బీన్స్, గుమ్మడి, దొండకాయ ఉత్పత్తి మాత్రం తగ్గుతుందని లెక్కగట్టింది.
మొత్తం 2019-20 పంట సంవత్సరంలో కూరగాయల దిగుబడి గతేడాదితో పోల్చితే 5 మిలియన్ టన్నులు పెరిగి 188 మిలియన్ టన్నులకు పెరుగుతుందని అంచనా వేసింది కేంద్రం.
పండ్ల ధరలకు రెక్కలు!
యాపిల్ దిగుబడి పెరుగుతుందని కేంద్రం లెక్కగట్టింది. అయితే... మామిడి, అరటి, ద్రాక్ష, దానిమ్మ ఉత్పత్తి మాత్రం తగ్గుతుందని అంచనా వేసింది.
సుగంధ ద్రవ్యాలు, పూల ఉత్పత్తి కూడా తగ్గనున్నట్లు తెలిపింది కేంద్రం.
ఇదీ చూడండి: పాక్ వద్ద పది.. భారత్ వద్ద నాలుగే..!