ETV Bharat / business

ఆరోగ్య సేతులో లోపాలు కనిపెట్టండి-రూ. లక్ష పట్టేయండి - ఆరోగ్య సేతు యాప్ సోర్స్ కోడ్

ఆరోగ్య సేతు అప్లికేషన్​లోని భద్రత పరమైన లోపాలను కనిపెట్టిన వారికి కేంద్రం నజరానా ప్రకటించనున్నట్లు తెలిపింది. ఇందుకోసం ఆరోగ్య సేతు సోర్స్​ కోడ్​ను డెవలపర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

arogya setu
ఆరోగ్య సేతు
author img

By

Published : May 27, 2020, 6:00 AM IST

Updated : May 27, 2020, 6:36 AM IST

ఆరోగ్య సేతు మొబైల్​ అప్లికేషన్​లో ఉన్న భద్రత పరమైన లోపాలను కనిపెట్టినవారికి నజరానా ప్రకటించింది కేంద్రం. ఈ మేరకు ఆరోగ్య సేతుకు సంబంధించిన సోర్స్​ కోడ్​​ను డెవలపర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

యాప్​లో ఉన్న బగ్స్​(లోపాలు)ను కనిపెట్టి సమాచారం అందించిన వారిని నాలుగు కేటగిరీలుగా వర్గీకరించి రివార్డులు అందజేయనున్నట్లు నేషనల్ ఇన్​ఫామేటిక్​ సెంటర్​ డైరెక్టర్ జనరల్ నీతా వర్మ తెలిపారు.

"భద్రత సమస్యలకు సంబంధించిన సమస్యలను మూడు కేటగిరీలుగా వర్గీకరించాం. ఒక్కో కేటగిరీకి రూ. లక్ష చొప్పున రివార్డు అందిస్తాం. కోడ్​ను మెరుగుపర్చడానికి ఇచ్చే సలహాలకు లక్ష రూపాయల బౌంటీ(రివార్డ్) ఉంటుంది. ఆరోగ్య సేతు అప్లికేషన్ సోర్స్ కోడ్ మంగళవారం అర్ధరాత్రి 12 తర్వాత గిట్​హబ్​(వెబ్​సైట్)లో అందుబాటులో ఉంటుంది."

-నీతా వర్మ, డైరెక్టర్ జనరల్, నేషనల్ ఇన్​ఫామేటిక్​ సెంటర్.

కాంటాక్ట్​ ట్రేసింగ్​ ద్వారా సేకరిస్తున్న సమాచార భద్రతపై వస్తున్న ఆందోళనలకు పరిష్కారం కనుగొనే విధంగా సోర్స్​ కోడ్​ను బహిరంగపర్చినట్లు నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్​ కాంత్ పేర్కొన్నారు. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం సోర్స్​ కోడ్​లను బహిరంగంగా విడుదల చేయలేదని తెలిపారు. పారదర్శకత, గోప్యత, భద్రత అనే అంశాలే ఆరోగ్య సేతు రూపకల్పనలో ప్రధానమైనవని స్పష్టం చేశారు.

Last Updated : May 27, 2020, 6:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.