ETV Bharat / business

చైనాకు గుడ్​బై చెప్పే సంస్థలపై భారత్​​ గురి - china exiting companies

వాణిజ్య యుద్ధంతో చతికిలబడిన చైనాను కరోనా మరింత కుంగదీసింది. అగ్రరాజ్య ఆరోపణలతో దిగ్గజ కంపెనీలు తమ ఉత్పత్తి కేంద్రాలను చైనా నుంచి తరలించాలని ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని అందిపుచ్చుకోవాలని భారత్ చూస్తోంది. ఈ మేరకు పారిశ్రామిక అవసరాలకోసం భూమిని కూడా కేటాయించినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో చాలా సవాళ్లు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

firms exiting China
చైనాను వదిలేసే సంస్థలను ఆకర్షించే పనిలో భారత్​!
author img

By

Published : May 5, 2020, 5:25 PM IST

"చైనానే దోషి"... అంతర్జాతీయంగా ఇప్పుడు పదేపదే వినిపిస్తున్న మాట. కరోనా సంక్షోభం నేపథ్యంలో అమెరికా సహా అనేక దేశాలు బీజింగ్​పైనే గురిపెట్టాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ స్థాయిలో ప్రాణనష్టం జరగడానికి, ఆర్థిక వ్యవస్థలు స్తంభించిపోవడానికి డ్రాగన్ దేశమే కారణమన్నది వారి వాదన. అమెరికాతో వాణిజ్య యుద్ధం కారణంగా ఇప్పటికే దెబ్బతిన్న చైనాకు కరోనా తెచ్చిన సంక్లిష్ట పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. ఇదే... అక్కడి అంతర్జాతీయ సంస్థలపైనా ప్రభావం చూపుతోంది.

దిగ్గజ సంస్థల పక్కచూపులు...

ఇప్పటివరకు తయారీ రంగ పరిశ్రమకు స్వర్గధామంగా విరాజిల్లుతోంది చైనా. ఆ దేశంలో అతి చౌకగా కార్మిక శక్తి లభించడమే ఇందుకు కారణం. ఈ సానుకూలతే అనేక విదేశీ దిగ్గజ సంస్థలు చైనాలో ఉత్పత్తి కేంద్రాలను స్థాపించేందుకు కారణమైంది. కానీ... ఇప్పుడు పరిస్థితి మారింది. అంతర్జాతీయంగా పెరుగుతున్న సంక్లిష్టతలతో ఆ సంస్థలు పునరాలోచనలో పడ్డాయి. భవిష్యత్​లో ఇబ్బందులు రాకుండా ఉండాలంటే.. చైనా నుంచి ఉత్పత్తి కేంద్రాలను ఇతర దేశాలకు తరలించడమే మేలన్న భావన ఆయా కంపెనీల్లో కనిపిస్తోంది.

చైనా వెలుపలకు ఉత్పత్తి కేంద్రాలు తరలించేందుకు ప్రయత్నిస్తున్న సంస్థలను ఆకర్షించే పనిలో పడింది భారత్​. ఇందుకోసం 4.62 లక్షల హెక్టార్ల భూమిని కేంద్రం గుర్తించిందని తెలుస్తోంది. ఇందులో 1.15 లక్షల హెక్టార్లు గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్​లో ఇప్పటికే ఉన్న పారిశ్రామిక భూమి.

చైనా నుంచి వెళ్లిపోయే జపాన్, దక్షిణ కొరియా, అమెరికా కంపెనీలకే భారత్​ ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని అన్ని రాష్ట్రాలు ఉపయోగించుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ ఇప్పటికే సూచించారు. చైనా నుంచి బయటకు వచ్చే కంపెనీలకు భూమి, ఇతర సదుపాయాలు కల్పించాలని సిఫార్సు చేశారు.

పారిశ్రామిక వర్గాలతో గడ్కరీ..

పరిశ్రమ వర్గాలతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడారు. జపాన్​కు చెందిన చాలా కంపెనీలు భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాయని తెలిపారు. చైనా వెలుపల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని అన్నారు.

గడ్కరీతో మాట్లాడిన వాళ్లలో ఎస్​ఎంఈ ఎగుమతుల ప్రచార మండలి​ అధ్యక్షుడు చంద్రకాంత్ సాలంఖీ ఒకరు. ప్రభుత్వానికి ఆయన పలు సూచనలు చేశారు.

" భారత్​కు వచ్చేందుకు చాలా సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని గడ్కరీ చెప్పారు. ప్రభుత్వం తరఫున అన్ని రకాల సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. దిల్లీ- ముంబయి మధ్య గ్రీన్​ ఎక్స్​ప్రెస్​ వే చుట్టూ ఉన్న భూమిని జపాన్​, దక్షిణ కొరియా కంపెనీలకు ఇవ్వాలని ప్రభుత్వానికి మేం సూచించాం."

- చంద్రకాంత్ సాలంఖీ

ఇది జరిగితే మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం పెట్టుబడులు పెట్టాల్సిన అవసరంలేదన్నారు సాలంఖీ.

"ఆ ప్రాంతంలో ఇండస్ట్రియల్​ పార్కులు ఏర్పాటు చేసుకునేందుకు జపాన్​, కొరియాకు అనుమతిస్తే మనకు లాభం జరుగుతుంది. ఆ పార్కుల్లో భారతీయ సంస్థలు తమ కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటాయి. "

- చంద్రకాంత్ సాలంఖీ

ఈ మార్గమే ఎందుకు?

  • "దిల్లీ- ముంబయి ఎక్స్​ప్రెస్​ వే పనులు వేగంగా కొనసాగుతున్నాయి. 2023 కల్లా ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుంది. ఈ రహదారితో దిల్లీ-ముంబయి మధ్య 12 గంటల్లో ప్రయాణం చేయవచ్చు.
  • ముంబయి- అహ్మదాబాద్​ మధ్య జపాన్​ సహకారంతో బుల్లెట్​ ట్రైన్​ ప్రాజెక్టు కూడా చేపడుతున్నారు. ఇది 2024 నాటికి అందుబాటులోకి వస్తుంది.
  • దిల్లీ- ముంబయి ఫ్రైట్​ రైల్​ కారిడార్​ (డీఎంఎఫ్​ఆర్​సీ) కోసం జపాన్ సహకారం అందిస్తోంది. ఈ ప్రాజెక్టుకు ఇరువైపులా ఇండస్ట్రియల్ పార్కులు, లాజిస్టిక్ కేంద్రాలు, గోదాముల నిర్మించేందుకు అవకాశం ఉంటుంది" అని స్పష్టం చేశారు గడ్కరీ.

సవాళ్లు అనేకం..

ఈ సంస్థలను ఆకర్షించేందుకు భారత్​లో అనే అవకాశాలు ఉన్నాయి. యువత, చౌక శ్రామిక శక్తి, అతిపెద్ద దేశీయ మార్కెట్​, సాంకేతిక- పారిశ్రామిక పరిజ్ఞానం భారత్​లో అపారంగా ఉన్నాయి. అయినప్పటికీ.. అంతర్జాతీయ దిగ్గజ సంస్థలకు భారత్​ మొదటి ప్రాధాన్యం కాబోదని నిపుణులు అంచనా వేస్తున్నారు.

"చైనా నుంచి భారత్​కు పూర్తి స్థాయి బదిలీ సాధ్యపడదు. చైనా వెలుపల అంతర్జాతీయ సంస్థలు విస్తరించేందుకు ప్రయత్నిస్తే భారత్​ లాభపడే అవకాశం ఉంది. "

- ఆర్. గాంధీ, ఆర్​బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్​

భూమి అతిపెద్ద సమస్య..

దేశంలో భూ కేటాయింపు నిబంధనలు కూడా విదేశీ సంస్థల రాకపై ప్రభావం చూపిస్తాయని మరికొంతమంది నిపుణలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే వంతెనలు, హైవేలు, ఆనకట్టలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల భూకేటాయింపుల్లో అనేక వివాదాలు ఉన్నాయి.

  • బంగాల్​లోని సింగూరులో టాటా గ్రూప్​నకు చెందిన నానో కార్ల తయారీ కేంద్రాన్ని మూసివేయాల్సి వచ్చింది. కొన్నేళ్ల పాటు జరిగిన హింసాత్మక నిరసనల అనంతరం గుజరాత్​లోని సనంద్​కు మార్చారు.
  • ఒడిశా తీరప్రాంతంలో దక్షిణ కొరియా ఉక్కు దిగ్గజం పోస్కోకు ఇదే పరిస్థితి ఎదురైంది. 10 ఏళ్లపాటు కొనసాగిన అనేక సమస్యల తర్వాత ప్రాజెక్టును నిలిపేయాలని 2016లో నిర్ణయం తీసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.