అంతర్జాల ట్రాఫిక్‌ను పర్యవేక్షించేందుకు కేంద్రీకృత నియంత్రణ వ్యవస్థను తీసుకువచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ వ్యవస్థ ద్వారా దేశవ్యాప్తంగా అంతర్జాలాన్ని పర్యవేక్షించనున్నట్లు కేంద్ర టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ రాజ్యసభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో పేర్కొన్నారు.
"చరవాణులు, ల్యాండ్లైన్లు, అంతర్జాలాన్ని న్యాయబద్ధంగా నియంత్రించేందుకు ఒక కేంద్రీకృత పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తున్నాం. అంతర్జాలాన్ని ప్రస్తుతం.. అంతర్జాల సేవలందించే సంస్థలు నియంత్రిస్తున్నాయి. 'ఇంటర్నెట్ మానిటరింగ్ సిస్టమ్' ద్వారా ఈ పర్యవేక్షణ జరుగుతుంది. ప్రస్తుతమున్న ఈ వ్యవస్థను 'కేంద్రీకృత నియంత్రణ వ్యవస్థ'కు అనుసంధానం చేసే అంశం కూడా పరిశీలనలో ఉంది."
--- కేంద్ర టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్