దేశీయంగా తయారీని పెంచడం, విదేశీ దిగుమతులను తగ్గించుకోవడంలో భాగంగా అవసరంలేని వస్తువుల జాబితాలో ఉన్న టీవీల దిగుమతులపై ఆంక్షలు విధించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం కేంద్ర ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, వాణిజ్య మంత్రిత్వ శాఖలు సంబంధిత ప్రతిపాదనపై చర్చిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దిగుమతులపై ఆంక్షలు విధిస్తే సంబంధిత దిగుమతిదారు వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) నుంచి లైసెన్సులు పొందాల్సి ఉంటుంది.
2018-19 మధ్య కాలంలో సుమారు ఒక బిలియన్ అమెరికన్ డాలర్లు విలువైన టీవీ ఉత్పత్తులు దేశంలోకి దిగుమతయ్యాయి. భారత్‌కు ఎగుమతి చేస్తున్న దేశాల్లో చైనా తొలి స్థానంలో ఉండగా.. వియత్నాం, మలేసియా, హాంకాంగ్, కొరియా, ఇండోనేసియా, థాయ్‌లాండ్, జర్మనీ దేశాలు తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.
దేశీయంగా తయారీని పెంచడంలో భాగంగా ఫర్నీచర్ దిగుమతులపైనా ఆంక్షలు విధించాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రిఫైన్డ్ పామాయిల్ దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించించి.
ఇదీ చూడండి:భారత పర్యటన: ఓ వైపు ట్రంప్.. మరోవైపు సత్యనాదెళ్ల!