ETV Bharat / business

ఎయిర్​ఇండియా ప్రైవేటీకరణలో మరో ముందడుగు

author img

By

Published : Apr 13, 2021, 7:08 PM IST

ఎయిర్​ఇండియా ప్రైవేటీకరణ దిశగా కేంద్రం మరో కీలక ప్రక్రియ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఆర్థిక బిడ్లను ఆహ్వానించే ప్రక్రియను ప్రారంభించింది. ఈ ఏడాది సెప్టెంబర్​ నాటికి ఈ పని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

Govt begins process for inviting financial bids for Air India sale, deal to conclude by Sep
ఎయిర్​ఇండియా ప్రైవేటీకరణలో మరో ముందగుడు

ఎయిర్ ఇండియాలో 100 శాతం వాటా విక్రయం కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక బిడ్లను ఆహ్వానించే ప్రక్రియను ప్రారంభించింది. 2021 సెప్టెంబర్‌ లోపు విక్రయం పూర్తయ్యే అవకాశం ఉంది. 2020 డిసెంబర్‌లో జరిగిన ప్రాథమిక బిడ్ల ప్రక్రియలో టాటా గ్రూప్‌ బిడ్‌ దాఖలు చేసింది. ప్రాథమిక బిడ్లను విశ్లేషించిన తర్వాత అర్హులైన పెట్టుబడిదారుల సందేహాలను వర్చువల్‌ మాధ్యమంలో తీరుస్తారు.

2007లో ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌లో విలీనం చేసినప్పటి నుంచి ఎయిర్ ఇండియాకు నష్టాలు వస్తున్నాయి.

ఎయిర్ ఇండియాను కొనుక్కునే సంస్థకు 4,400 దేశీయ, 1,800 అంతర్జాతీయ ల్యాండింగ్‌, పార్కింగ్‌ స్లాట్‌లు దక్కుతాయి. విదేశాల్లోని విమానాశ్రయాల్లో 900 స్లాట్‌లు చేకూరుతాయి.

కేంద్రం 2017లో ఎయిర్ ఇండియా విక్రయ ప్రక్రియ ప్రారంభించగా, ఆ సంస్థకు ఉన్న రూ. 60వేల 74 కోట్ల అప్పులను పూర్తిగా భరించాలన్న నిబంధన కారణంగా ఏ కంపెనీ కూడా ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలోనే కొనుగోలుకు ముందుకు వచ్చే కంపెనీలు అప్పులను తమ ఇష్టం మేరకు తీసుకునే వెసులుబాటు కల్పించింది.

ఇదీ చూడండి: ప్రైవేటీకరణపై తగని అత్యుత్సాహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.