ETV Bharat / business

వారికి ఏడాది చివరి వరకు వర్క్ ఫ్రం హోం!

ఐటీ, బీపీఓ ఉద్యోగులు ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు వర్క్​ ఫ్రం హోం చేసుకునేందుకు అవకాశం కల్పించింది కేంద్రం. కరోనా వైరస్ కేసులు రోజురోజుకు రికార్డు స్థాయిలో పెరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది.

work from till year end
ఈ ఏడాదంతా వర్క్ ఫ్రం హోం
author img

By

Published : Jul 22, 2020, 4:09 PM IST

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో వర్క్​ ఫ్రం హోం గడువును మరోసారి పొడిగించింది కేంద్రం. ఐటీ, బీబీఓ సంస్థలు తమ ఉద్యోగులకు డిసెంబర్ 31 వరకు వర్క్​ ఫ్రం హోం ఇచ్చేందుకు వీలు కల్పించింది.

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఏప్రిల్ 30 వరకు వర్క్​ ఫ్రం హోం వెసులుబాటు ఇచ్చింది కేంద్రం. తర్వాత కూడా కొవిడ్​-19 కేసులు తగ్గకపోవడం వల్ల జులై 31 వరకు గడువు పెంచింది. ఇప్పుడు పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారటం వల్ల ఏకంగా డిసెంబర్ 31 వరకు గడువు పొడిగించింది.

ప్రస్తుతం ఐటీ సంస్థలు 85 శాతం వరకు ఉద్యోగులను వర్క్​ ఫ్రం హోం చేయించుకుంటున్నాయి. తప్పనిసరి అవసరాలకు మాత్రమే కార్యాలయాల్లో ఉద్యోగులతో పనులు చేయిస్తున్నాయి.

సర్వీస్​ ప్రొవైడర్ల నిబంధనల సడలింపు..

వర్క్ ఫ్రం హోం చేసే వారికి మెరుగైన సేవలు అందించేందుకు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు టెలికాం విభాగం (డాట్) గతంలో పలు సడలింపులు ఇచ్చింది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఆ సడలింపులనూ డిసెంబర్ 31 వరకు పొడిగించింది డాట్​.

ఇదీ చూడండి:మేలో కొత్త ఉద్యోగుల సంఖ్య 3.18 లక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.