ETV Bharat / business

భారత్​లో గూగుల్ న్యూస్ షోకేస్​- 30 సంస్థలతో డీల్ - డజనుకు పైగా దేశాల్లో గూగుల్ న్యూస్ షోకేస్

వార్తా సంస్థల కంటెంట్​ను ప్రోత్సహించేందుకు తీసుకొచ్చిన న్యూస్​​ షోకేస్​ను భారత్​లో ప్రారంభించినట్లు గూగుల్ ప్రకటించింది. ఇందులో భాగంగా 30 వార్తా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది.

Google Showcase latest update
గూగుల్ న్యూస్ షోకేస్​
author img

By

Published : May 18, 2021, 3:40 PM IST

టెక్ దిగ్గజం గూగుల్ తన న్యూస్ షోకేస్ కార్యక్రమాన్ని భారత్​లోను ప్రారంభించినట్లు మంగళవారం ప్రకటించింది. ఇందులో భాగంగా 30 వార్తా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది.

గూగుల్​ న్యూస్​, డిస్కవర్​ ప్లాట్​ఫామ్​ల ద్వారా దేశంలోని పబ్లిషర్లను ప్రోత్సహించేందుకు, నాణ్యమైన కంటెంట్​ను అందించేందుకు తీసుకొచ్చిన కార్యక్రమమే ఈ న్యూస్ షోకేస్​. ఇందుకోసం ఆయా సంస్థలకు చెల్లింపులు కూడా జరపనుంది గూగుల్​.

ఇందులో భాగంగా రానున్న మూడేళ్లలో దేశంలోని 50 వేల జర్నలిస్టులు, జర్నలిజం విద్యార్థులకు డిజిటల్ నైపుణ్యులు పెంచేందుకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపింది గూగుల్.

ఇప్పటికే.. జర్మనీ, కెనాడా, ఫ్రాన్స్, జపాన్​, యూకే, ఆస్ట్రేలియా, ఇటలీ, అర్జెంటీనా సహా డజనుకుపైగా దేశాల్లో 700 వార్తా సంస్థలతో గూగుల్​ న్యూస్ షోకేస్​ ఒప్పందాలు కుదుర్చుకుంది.

ఇదీ చదవండి:ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానం కోల్పోయిన మస్క్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.