ETV Bharat / business

సురక్షిత లావాదేవీల కోసం గూగుల్ పే అలర్ట్స్​

గూగుల్ పే వినియోగదారులు సురక్షిత లావాదేవీలు జరపడానికి వీలుగా ఎస్​ఎంఎస్ అలర్ట్​లను ప్రారంభించింది. అలాగే అనుమానాస్పద లావాదేవీల విషయంలో అప్రమత్తం చేయడానికి నోటిఫికేషన్లనూ పంపిస్తోందీ డిజిటల్​ పేమెంట్​ యాప్​.

సురక్షిత లావాదేవీల కోసం గూగుల్ పే అలర్ట్స్​
author img

By

Published : Aug 1, 2019, 5:50 PM IST

వినియోగదారులు... అనుమానాస్పద లావాదేవీలను సులభంగా గుర్తించడం కోసం గూగుల్​ పే నోటిఫికేషన్లు, ఎస్​ఎంఎస్​ అలర్ట్​ సేవలను ప్రారంభించింది. వినియోగదారులు తమ బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు పంపే జరిపే ప్రతిసారీ ఇలా ఎస్​ఎంఎస్​లు పంపించడం ద్వారా సురక్షిత లావాదేవీలు జరగడానికి వీలవుతుంది.

"వినియోగదారులు (గూగుల్​ పే) మాపై నమ్మకంతో తమ విలువైన సంపదను (డబ్బును) మాకు అప్పగించారు. ఈ నమ్మకాన్ని నిలబెట్టుకునే బాధ్యత మాపై ఉంది."
- అంబరీష్​ కెంఘే, గూగుల్​ పే ప్రొడక్ట్​ మేనేజర్​​

ఒక బ్యాంకు ఖాతా నుంచి మరొక బ్యాంకుకు లావాదేవీలకై ఇటీవల ఎక్కువగా 'యూపీఐ' తరహా డిజిటల్​ పేమెంట్​ యాప్స్​కే ప్రాధాన్యం ఇస్తున్నారు వినియోగదారులు.

'గత రెండేళ్లలో యూపీఐ ద్వారా తక్షణ నగదు బదిలీలు మరింత ఎక్కువయ్యాయి. ఫలితంగా లక్షల మంది భారతీయులు మొదటిసారిగా డిజిటల్​ చెల్లింపులకు మారడానికి దోహదం చేసింది. గూగుల్ పే... ఎలాంటి మోసాలకు అవకాశమివ్వకుండా అనేక మౌలిక భద్రతా సదుపాయాలను అందిస్తోందని' అంబరీష్ తెలిపారు.

గూగుల్​ పే... మెషిన్​ లెర్నింగ్ ఆధారిత స్కామ్​ నివారణ నమూనా ఉపయోగిస్తోంది. అనుమానాస్పదమైనవి అయినా కాకపోయినా... వినియోగదారులు జరిపే ప్రతి లావాదేవీ సమయాల్లో 'స్కామ్​' లేదా 'స్ట్రేంజర్​' హెచ్చరికలను కూడా పంపిస్తుంది.

ఇదీ చూడండి: భారత మార్కెట్​లోకి విద్యుత్​ వాహనాలు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.