ETV Bharat / business

డిజిటల్ వాలెట్లలో పరస్పర నగదు బదిలీ సదుపాయం!

author img

By

Published : May 21, 2021, 6:23 AM IST

వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి.. గూగుల్​పే, పేటీఎం, ఫోన్​ ​పే వంటి సంస్థలు తమ యూజర్లకు ఇంటరోపెరాబిలిటి(పరస్పర నగదు బదిలీ) సదుపాయం కల్పించడం తప్పనిసరికానుంది. దీనికి సంబంధించి ఆర్​బీఐ తాజాగా ఆయా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.

digital wallet interoperability
ఇంటరోపెరాబిలిటి సదుపాయం

గూగుల్​పే, పేటీఎం, ఫోన్​పే సహా ఇతర డిజిటల్ పేమెంట్ యాప్​లు తమ యూజర్లకు​ ఇంటరోపెరాబిలిటి (పరస్పర నగదు బదిలీ) సుదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని రిజర్వ్ బ్యాంక్ (ఆర్​బీఐ) ఆదేశించింది. ఈ మేరకు విడుదల చేసిన నోటిఫికేషన్​లో.. ఫుల్​ కేవైసీ పూర్తయిన తమ వినియోగదారులందరికీ 2022 మార్చి 31లోపు ఈ ఫీచర్​ అందుబాటులో ఉండాలని స్పష్టం చేసింది. ప్రీపెయిడ్ పేమెంట్​ ఇన్​స్ట్రూమెంట్​ (పీపీఐ) విధానంలో పని చేసే వాలెట్లన్నింటికి ఇది తప్పనిసరి అని పేర్కొంది.

ఏమిటి ఈ ఇంటరోపెరాబిలిటి?

ఇంటరోపెరాబిలిటి.. డిజిటల్ పేమెంట్ యాప్​లు వినియోగించే యూజర్లు (ఫుల్ కేవైసీ ఉన్న వాళ్లకు మాత్రమే).. ఇతర పీపీఐలకు నగదు బదిలీ చేసుకునే వెసులుబాటు కల్పించడం (పేటీఎం నుంచి ఫొన్​పేకు లేదా ఫొన్​ పే నుంచి పేటీఎంకు పరస్పరం నగదు బదిలీ చేసుకునే వెసులుబాటు).

నాన్ బ్యాకింగ్ వాలెట్​ల నుంచి పరిమితంగా నగదు ఉపసంహరణకు వెసులుబాటు కల్పించింది. ఒక ట్రాన్సాక్షన్​లో గరిష్ఠంగా రూ.2 వేలు, నెలకు రూ.10 వేల చొప్పున విత్​డ్రాకు అనుమతినిచ్చింది.

ఇదీ చదవండి:'వారి సమాచారం కోసం భారత్ భారీగా​ అభ్యర్థనలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.