ETV Bharat / business

ఎయిర్​టెల్​లో గూగుల్ 100 కోట్ల డాలర్ల పెట్టుబడి- 5జీపై గురి! - ఎయిర్​టెల్​లో గూగుల్​ పెట్టుబడి

Google Airtel Partnership: భారతీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్​టెల్​లో భారీ పెట్టుబడులు పెట్టనుంది గూగుల్. 700 మిలియన్ డాలర్లతో ఎయిర్​టెల్​లో 1.28శాతం వాటా కొనుగోలు చేయనుంది. మరో 300 మిలియన్ డాలర్లను వేర్వేరు ఒప్పందాల అమలు కోసం ఖర్చు పెట్టనుంది.

Google Airtel Partnership
ఎయిర్​టెల్​ గూగుల్​
author img

By

Published : Jan 28, 2022, 12:13 PM IST

Updated : Jan 28, 2022, 12:55 PM IST

Google Airtel Partnership: భారతీయ ఎయిర్​టెల్​లో ఏకంగా 100 కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టనుంది టెక్ దిగ్గజం గూగుల్. ఇందులో 70 కోట్ల డాలర్లతో గూగుల్​లో 1.28 శాతం వాటా కొనుగోలు చేయనుంది. మిగిలిన మొత్తాన్ని రానున్న ఐదేళ్లలో ఎయిర్​టెల్​తో వేర్వేరు ఒప్పందాలు చేసుకుని, అమలు పరిచేందుకు వెచ్చించనుంది. 'గూగుల్ ఫర్ ఇండియా డిజిటైజేషన్ ఫండ్​' కార్యక్రమంలో భాగంగా ఈ పెట్టుబడి పెడుతోంది గూగుల్.

ఒక్కో షేరును రూ.734 చొప్పున మొత్తం 71,176,839 షేర్లను గూగుల్​ ఇంటర్నేషనల్ ఎల్​ఎల్​సీకి జారీ చేసేందుకు భారతీ ఎయిర్​టెల్​ ఆమోదం తెలిపింది. దీని ద్వారా ఎయిర్​టెల్​కు 70 కోట్ల డాలర్లు (రూ.5,224.3 కోట్లు) సమకూరనున్నాయి.

భారత్​లో 5జీ నెట్​వర్క్​ త్వరలో అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ఎయిర్​టెల్​- గూగుల్ డీల్ ప్రాధాన్యం సంతరించుకుంది. 5జీ సాంకేతికతతో భారతీయ యూజర్లకు ప్రత్యేకమైన సేవలు అందించడంపై ఈ రెండు సంస్థలు దృష్టిసారించనున్నాయి. ఈ భాగస్వామ్యం ద్వారా ఎయిర్​టెల్​ వినియోగదారులుగా ఉన్న 10 లక్షల చిన్న, మధ్య తరగతి వ్యాపారాలకు గూగుల్​ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

"భారత్​లోని డిజిటల్​ ఎకోసిస్టమ్​ను విస్తరించడమే లక్ష్యంగా గూగుల్​తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాము." అని భారతీ ఎయిర్​టెల్​ ఛైర్మన్​ సునీల్​ భారతీ మిత్తల్​ పేర్కొన్నారు.

కొత్త బిజినెస్​ మోడల్స్​ను ప్రోత్సహించే దిశగా కనెక్టివిటీని పెంచడం సహా స్మార్ట్​ఫోన్​ వినియోగం పెంచడంలో ఈ భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని గూగుల్​ సీఈఓ సుందర్​ పిచాయ్​ అభిప్రాయపడ్డారు.

2020 జులైలో 'గూగుల్ ఫర్​ ఇండియా డిజిటైజేషన్​ ఫండ్'​ను ప్రారంభించారు సుందర్​ పిచాయ్. 10 బిలియన్​ డాలర్లను భారతకు చెందిన సంస్థల్లో పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా ఇప్పటికే జియో సంస్థలో రూ.33,737 కోట్లను గూగుల్​ పెట్టుబడి పెట్టింది. తక్కువ ధరకే ఆండ్రాయిడ్​ ఫోన్లు అందుబాటులోకి తెచ్చేలా జియాతో కృషి చేస్తోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్​ ఉచితం!

ఇదీ చూడండి : Digital payments: డిజిటల్​ పేమెంట్స్​లో జోరు- అగ్రగామి భారత్​

Last Updated : Jan 28, 2022, 12:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.