బంగారం ధర శుక్రవారం స్వల్పంగా తగ్గింది. దిల్లీలో 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.239 తగ్గి.. రూ. 45,568కు దిగొచ్చింది. అంతర్జాతీయం బంగారం ధరలు తగ్గడం వల్లే దేశీయంగాను పసిడి ధరలు తగ్గినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
పసడి బాటలో పయనించిన వెండి.. కిలోకు రూ.723 తగ్గి రూ.67,370కు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,774 డాలర్లు ఉండగా.. వెండి ధర 26.94 డాలర్లు వద్ద ఫ్లాటుగా ఉంది.
ఇదీ చూడండి: కరోనాకు పతంజలి 'కొరొనిల్ టాబ్లెట్'